HomecinemaVijay Deverakonda : విజయ్ సరసన ఈ హాట్ బ్యూటీ రెడీ!

Vijay Deverakonda : విజయ్ సరసన ఈ హాట్ బ్యూటీ రెడీ!

Telugu Flash News

యంగ్ హీరో విజయ్ దేవరకొండకు (vijay deverakonda) ‘లైగర్’తో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించాలనుకున్నాడు కానీ అది కుదరలేదు. అందుకే రూటు మార్చాడు. యాక్షన్ పక్కన పెట్టి లవ్ స్టోరీలు తీస్తున్నాడు. ఇప్పటికే ‘ఖుషి’ సెట్స్‌పై ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 న విడుదల కానుంది. ఇదిలా ఉంటే విజయ్ మరో ప్రేమకథతో రెడీ అవుతున్నాడు.

విజయ్ దేవరకొండ కెరీర్‌లో ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలు మాత్రమే హిట్‌గా నిలిచాయి. చాలా మంది అభిమానులకు యాక్షన్ కంటే విజయ్‌లోని లవ్ యాంగిల్ నచ్చుతుంది. అందుకే ‘గీత గోవిందం’ సీక్వెల్ కోసం రౌడీ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ ప్రకారం కొన్నాళ్ల క్రితం దర్శకుడు పరశురాంతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు విజయ్.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని తేలింది. ‘సీతారామం’ తో సంచలనం సృష్టించిన మృణాల్‌ ఠాకూర్‌ (mrunal thakur) ని విజయ్‌ దేవరకొండకు హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు సమాచారం.

ఈ సినిమా జూన్ 14 న బుధవారం హైదరాబాద్ లో గ్రాండ్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇది స్వచ్ఛమైన ప్రేమకథ అని, విజయ్,మృణాల్ మధ్య మంచి రొమాన్స్ గ్యారెంటీ అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఏంటనేది తెలియాలి.

read more news :

Vijay- Rashmika : ర‌ష్మిక‌, విజ‌య్ మ‌ధ్య ఏం న‌డుస్తుంది..? మొన్న మాల్దీవులు.. ఇప్పుడు దుబాయ్ టూర్..

-Advertisement-

Mrunal Thakur black and bold Photoshoot 11-06-2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News