Mrunal thakur: సినీ సెలబ్రిటీలకి ట్రోలింగ్ అనేది కొత్త కాదు. తెలుగులో డెబ్యూ మూవీతోనే స్టార్ అయిపోయిన మృణాల్ ఠాకూర్.. ఒకే ఒక్క స్టేట్ మెంట్ వలన దారుణమైన ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తనకు భర్తగా రాబోయే వ్యక్తిలో అందం చూడనని మంచివాడు అయితే చాలని చెప్పింది.
దీంతో అబ్బో.. మృణాల్ వ్యక్తిత్వం కూడా అందానికి ప్రాధాన్యత ఇచ్చే రకం కాదని అందరూ ఎంతో ప్రశంసించారు. ఇక రీసెంట్ గా మరో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కపిల్ శర్మ షోలో పాల్గొంది ముద్దుగుమ్మ.
ఈ షోలో కాబోయేవాడు ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు.. ‘తనకు అందమైన వాడు కావాలి’ అని చెప్పింది.
అరే అదేంటి.. మొన్ననే కదా అందం అక్కర్లేదు అన్నట్టు మాట్లాడింది.. ఇంతలోనే మళ్లీ ఇలా మాట మార్చిందేంటీ? అని నెటిజన్స్ ఈ అమ్మడిని దారుణంగా ట్రోల్స్ స్టార్ట్ చేశారు.
మృణాల్ వట్టి అబద్దాలకోరు.. మాటలమారి అని, ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మాటలు మార్చేస్తుందని సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ తో నానా రచ్చ చేస్తున్నారు.
ఈ క్రమంలో మృణాల్ స్పందిస్తూ.. “నాకప్పుడు అలా అనిపించి అది చెప్పాను. ఇప్పుడిలా అనిపించి ఇది చెప్పాను. పర్సనల్ గా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి అని పేర్కొంది మృణాల్.
also read:
bhumi pednekar hot stills at Sidharth, Kiara Advani reception
Ananya Nagalla Latest Instagram Photos 2023 | Ananya Nagalla Hot