Homemoral stories in telugumoral stories in telugu : నిజాయితీని మించిన సుగుణం ఉండదు.

moral stories in telugu : నిజాయితీని మించిన సుగుణం ఉండదు.

Telugu Flash News

moral stories in telugu : ఒక గురువు తన దగ్గర విధ్యాభ్యాసం చేస్తున్న శిష్యుల నందరినీ పిలిచి ” శిష్యులారా! నేను నా కుమార్తెకు పెళ్ళి చేయాలని నిశ్చయించాను. పెళ్ళి అంటే మాటలు కాదు కదా! పెళ్ళి చేసే స్తోమత నాకు లేదు. అందుకని మీరు జాగ్రత్తగా, ఎవ్వరికి పట్టు పడకుండా నగలు, డబ్బు, విలువైన వస్త్రాలు దొంగిలించుకొని రావాలి. మీరు ఇవన్నీ సంపాదించి పెడితే నేను అప్పు చేయక్కర్లేకుండా, శ్రమపడకుండా పెళ్ళి చేసేస్తాను అన్నాడు.

అప్పుటి కప్పుడు విద్యార్ధులు ధనం నగలు విలువైన వస్తువులు తస్కరించటానికి వెళ్ళి ప్రతిరోజూ అంతో ఇంతో గురువు గారికి సమర్పించుకుంటున్నారు. గురువు గారు పుచ్చుకొని జాగ్రత్త చేస్తున్నారు. ఏ శిష్యుడు ఎవరింటి నుంచి, ఏమి తస్కరించి తీసుకు వచ్చాడో. ఒక పుస్తకంలో వ్రాసుకుంటున్నాడు. అందరూ శిష్యులు గురువుగారి కూతురి కోసం అంత శ్రమపడి వస్తువులు, ధనం సేకరిస్తున్నా “సిద్ధార్ధ” అనే శిష్యుడు ఎక్కడికీ వెళ్ళట్లేదు. ఏమితేవట్లేదు.

ఏ వస్తువులు, నగలు, ధనం తస్కరించి తేవట్లేదు. మనస్సాక్షినుంచి అది గమనించి ‘నా కుమార్తె పెళ్ళికి సాయపడవా?’ అని గురువు గారు సిద్ధార్దను అడిగారు. శిష్యుడైన సిద్ధార్ధ “అయ్యా! గురువర్యా! దీ నేను తస్కరించేటప్పుడు ఎవ్వరూ చూడకపోవచ్చు, చోరకళలో ప్రావీణ్యం సంపాదించవచ్చు. ఎంతమంది దృష్టి నుంచి తప్పించు కున్నా, నానుంచి నేను తప్పించుకోలేను. నా తప్పించుకోలేను. నాలో కొలువై ఉన్న ‘ఆత్మారాముడి’ నుంచి తప్పించు కోలేను.

‘ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా!’ అని నా మనస్సు ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పుకు తీరాలి. ఎందరి కళ్లలో దుమ్ము కొట్టినా, నా కళ్లలో నేను దుమ్ము కొట్టుకోలేను. నన్ను క్షమించండి గురువు గారు !” అని దండం పెట్టాడు. గురువు గారి ఆనందానికి అంతులేదు.

” ప్రియ శిష్యా! సిద్ధార్ధా! నా కుమార్తెకు తగిన వరుడివి నీవే ! యోగ్యుడైన అల్లుని, వెతకటం కోసమే ఈ పరీక్ష పెట్టాను. సద్గుణ సంపన్నుడవైన నీ సాహచర్యంలో నా కుమార్తె సుఖపడుతుంది. నా కుమార్తెను వివాహం చేసుకో నాయనా! ఆడపిల్ల తండ్రిగా అర్ధిస్తున్నాను” అన్నాడు గురువు. శిష్యుడు సిద్ధార్థ సంతోషంగా ఒప్పుకున్నాడు.

నీతి : నిజాయితీని మించిన సుగుణం ఉండదు.

-Advertisement-

also read :

summer precautions : ఎండాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

Rajamouli: తారక్, చరణ్ నాతో బ‌ల‌వంతంగా వోడ్కా తాగించారు అంటూ రాజ‌మౌళి షాకింగ్ కామెంట్స్

H3N2 Virus : ఏడు రోజులైనా జ్వరం, దగ్గు తగ్గడం లేదా? ఐసీఎంఆర్ కీలక హెచ్చరిక!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News