Telugu Flash News

moral stories in telugu : బంగారు బాతు.. కథ చదవండి..

golden duck moral story

golden duck moral story

moral stories in telugu : ఒక ఊరిలో ఒక దురాశపరుడైన రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక బాతు ఉంది. ఆ బాతు ప్రతిరోజూ బంగారు గుడ్డు పెడుతుంది. ఆ బంగారు గుడ్డు అమ్ముతూ ఆ రైతు హాయిగా గడిపేవాడు.

కానీ కొంతకాలం తర్వాత అతను తన చుట్టూ ఉన్న ధనవంతులలో అత్యంత ధనవంతుడు కావాలనుకున్నాడు. అకస్మాత్తుగా, అతనికి ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. బాతు రోజుకు ఒక గుడ్డు పెడుతోంది.

ఆ బాతు కడుపులో ఎన్ని గుడ్లు ఉంటాయో.. వాటన్నింటిని ఒకేసారి తీసుకుని ధనవంతుడిని అయిపోతాను అని అనుకున్నాడు, దాని కడుపు కోసి ఆ గుడ్లను అన్నిటినీ తీసుకుంటాను, అని ఆలోచించాడు.

ఆ ఆలోచన రాగానే కత్తి తీసుకుని బాతు కడుపు కోసేశాడు. లోపల ఒక్క గుడ్డు కూడా లేదు. ఆ బాతు కాస్త చచ్చిపోయింది. రోజూ ఒక గుడ్డు తీసుకుంటే బాగుండేదని, ఏడవసాగాడు.

నీతి: దురాశ దుఃఖానికి మూలం . మీరు ఏ పని అయిన చేసేముందే ఆలోచించండి.

also read :

moral stories in telugu : నీతి కథలు చదవండి

 

Exit mobile version