moral stories in telugu : అడవి దగ్గర్లోనే ఉన్న పల్లెకి ఒక నక్క వెళ్ళింది. అక్కడ చెరువు గట్టున చాకలి బానలు ఉన్నాయి. సంధ్యా సమయం కనుక చాకలి వారంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. నక్క ఒక పెద్ద బానలో దూకింది. మళ్ళీ బయటకు రావటం చేతకావట్లేదు. కాళ్ళు జారుతున్నాయి.
ఆ బానలో బట్టలకు పెట్టే నీలిమందు ఉంది. నక్క ఒంటికి నీలం రంగు అంటుకుంది. జిత్తుల మారి నక్క చచ్చిపోయినట్టు పడుకుంది. మర్నాడు రజకులు వచ్చి బానలో పడి చచ్చిపోనాది అంటూ దాన్ని బయటపడేశారు. తన పథకం అక్కరకొచ్చినందుకు సంతోషించి నక్క అడవిలోకి పరుగు తీసింది.
నీలం రంగులో ఉన్న నక్కని చూసి జంతువులన్నీ ఆశ్చర్య పోయాయి.ఇంక నక్క గొప్పలు చెప్పటం ప్రారంభించింది. ” మేఘం నీలి రంగులో ఉంటుంది. విష్ణు మూర్తి నీలం రంగులో ఉంటాడు. నాలో దైవాంశ ఉండటం వలన వనలక్ష్మి నాకు నీల వర్ణం ప్రసాదించి ఈ అరణ్యానికి రాజుగా ఉండమని ఆనతిచ్చింది.” అంది.
జంతువులన్నీ నిజమని నమ్మి నక్కను రాజుగా ప్రకటించుకున్నాయి. అధికారం చేజిక్కగానే గొప్ప కోసం అన్ని జంతువులకి పదవులు కట్టపెట్టి స్వజాతి వారికైన నక్కలకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు సరికదా వారిని సేవలు చేయటానికి నియమించింది.
చిన్న పదవిని కూడా ఇవ్వకుండా చిన్నబుచ్చింది. “కష్టంలో అదుకోనేది మనం, పదవులన్నీ పరాయి వారికి దక్కాయి. ఇంట గెలిచి రచ్చగెలవాలి అని తెలీదు! దీనికి బుద్ధి చెప్పాలి. అధికార గర్వం అణచాలి. అనుకొని ఒక సంధ్యవేళ నక్కలన్నీ సమావేశమై ఊళపెట్టాయి.
స్వజాతి పిలుపు విని నక్క కూడా ఊళపెట్టింది. అప్పటికి దాని నీలి రంగు కూడా వెలిసిపోయింది. మామూలు నక్క చర్మం బయటపడింది. దగ్గరకు ఉన్న మృగరాజు “నువ్వు మాములు నక్క వేనా ! ఏదో దైవాంశ సంభూతిరాలినన్నావు. నీలకర్ణుని అంశ ఉన్నదాన్నని కూశావు. నోరు, పెట్టుకు బతకవే ఓ నీరజాక్షి’ అన్నట్టు చేసి గోపురాలంత గొప్పలు చెప్పి అధికారం అందుకున్నావు. నేను కదా మృగరాజుని గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి మీద పడి రక్కి నక్కకి బుద్ధి చెప్పింది.
నీతి: ఎంత మోసగానిగైనా తన స్వజాతి లక్షణం పోదు.
also read :
Venkatesh: వెంకటేష్ నోటి నుండి ఆ మాట రావడంతో ఉలిక్కిపడ్డ ఫ్యాన్స్..!
Naresh: నరేష్, పవిత్ర లోకేష్ మరోసారి అందరిని ఫూల్స్ చేసినట్టేనా..!