moral stories in telugu : అనావృష్ఠి జీవకోటి పాలిట తీరని శాపం. ఒక ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జీవులు గుక్కెడు నీళ్ళ కోసం కటకట పడ్డాయి. ఏనుగులు భూచర జీవులన్నింటిలోకి చాలా పెద్దవి. వాటికి నీరు సరిపడా కావాలంటే పెద్ద పెద్ద జలాశయాలు కావాలి. ఒక ఏనుగు తన రాజుతో “గజరాజా! నేను జలం ఉన్న పెద్ద సరోవరాన్ని చూశాను. అక్కడికి పోదాం అనగానే అన్ని ఏనుగులు పరుగులు తీశాయి. దారిలో కుందేళ్ళను కసబిస తొక్కేశాయి.
ఫలితంగా వేలాది కుందేళ్ళు ఏనుగుల భారీ కాయం మోసే బలమైన పాదాల కింద పడి చనిపోయాయి. కొన్ని క్షతగాత్రులై నాలుగా బ్రతికున్నాయి. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది అన్నటుగా ఉందని కుందేలు రాజు చాలా దుఃఖించాడు.ఒక తెలివిగల కుందేలు “రాజా బాధపడకు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు.
ఇంక ఏనుగులు ఇటువైపు రావు !”అని హమీ ఇచ్చి ఏనుగుల సమూహం దగ్గరకు వెళ్ళి “గజరాజా! శివుని శిరస్సున ఉండే చందమామ మీమీద చాలా కోపంగా ఉన్నాడు.” అన్నాడు. గజరాజు అదేంటి మేమేమి చేశాం? అని అడిగాడు. మీరు నీరు కోసం వెళుతూ వేలాది కుందేళ్ళను చంపేశారు. చంద్రుడిలో మా పూర్వీకుడైన కుందేలు ఉన్నాడు మీరెప్పుడూ చూడలేదా కుందేలు అంటే చంద్రుడికి ఇష్టం. అందుకే ‘శివునికి ‘చంద్రశేఖరుడనే’ పేరు వచ్చింది.
కొలను దగ్గరికి పద! స్వయంగా చూద్దువుగాని అని కుందేలు గజరాజుని సరస్సు దగ్గరికి తీసుకువెళ్ళింది. సరోవరంలో చందమామను చూసి అర్ఘ్యం ఇచ్చి పుచ్చుకుందామని తొండంతో నీలిని పీల్చింది. నీరు చెదిరి చందమామ అద్దం మీద ఆవగింజలా కదులుతున్నట్టు కనిపించింది. ఇదే అదను అని “చూశావా గజరాజా! నీ పూజని చంద్రుడు నిరాకరించాడు. ఇంకెప్పుడూ ఈ సరస్సుకి రాకు” అంది. నిజమేననుకొని క్షమించమని అడిగి వెళ్ళిపోయి మరెప్పుడూ ఏనుగులు ఆ సరస్సుకి రాలేదు. తెలివి గల కుందేలు మంత్రి పదవిని అలంకరించింది.
నీతి : ఆపదలను అడ్డుకొనటానికి యుక్తిని మించిన ఆయుధమే లేదు.
also read :
Pawan Kalyan : వాట్ ఏ కాంబినేషన్.. ధోని నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా..!
horoscope today telugu : 06-04-2023 గురువారం రాశి ఫలాలు
Summer Skin Care: వేసవిలో చర్మాన్ని ఇలా సంరక్షించుకోండి..