moral stories in telugu : ఒక గ్రామంలో నాగమ్మ, వీరయ్య అనే అమాయక దంపతులుండేవారు. కాని కర్తవ్య నిర్వహణ వారికి దైవంతో సమానం. ఆమె అత్తమామల సేవలు, అతిధి మర్యాదలు సక్రమంగా చేస్తూ ఆదర్శగృహిణి అనిపించుకొన్నది. వీరయ్య అమాయకత్వాన్ని చూసి గడుసరి వారు మోసం చేసేవారు. గంత తగ్గ బొంత’ అని హేళన చేసేవారు.
ఒక రోజు రాత్రి బాగా పొద్దుపోయాక “నాగమ్మా! ఇందాక నాకు అన్నం సహించలేదు. ఇప్పుడు ఆకలిగా ఉంది. అన్నం వండి పెట్టవూ” అని అడిగాడు. భర్తఎప్పుడూ అట్లాఅడగలేదు. ఆమెకి జాలేసింది.
“అట్లాగేనయ్యా నిమిషాల్లో వండి పెడతాను! కాని నిప్పులేదయ్యా! పొరిగింటికెళ్ళి అగ్గి తీసుకురావయ్య!” అంది. చిమ్మచీకటిగా ఉంది నాగమ్మా! కన్ను పోడుచుకున్నా కానరావట్లేదు ఎట్లా? అన్నాడు వీరయ్య.
“లాంతరు దీపం తీసుకెళ్ళయ్యా! అదే తోవ చూపిస్తుంది.” అంది భార్య. ఒక చేత్తో లాంతరు, మరోక చేత్తో నిప్పు కణికలు వేసుకోవటానికి మూకుడు పట్టుకొని వేగంగా వెళ్తున్నాడు.
ఒక మునీశ్వరుడు ఎదురుగా వచ్చాడు. ‘దండాలు సాములోరు !’ అని నమస్కరించాడు. “ఇంత చీకట్లో ఎక్కడికి వెళుతున్నావు వీరయ్యా! రోజూ ఈ పాటికి పడుకుంటావు కదా! అనడిగాడు ముని.
ఆకలిగా ఉంది. సాములూ ! వంట చెయ్య టానికి ఇంట్లో నిప్పులేదు పక్కింటికి వెళ్ళి నిప్పు తెమ్మంది మా ఇంటిది తేవటానికి వెళ్తున్నా! అన్నాడు వీరయ్య.
ముని నవ్వి ” నీ చేతిలో లాంతరు వెలుగుతుంది అది నిప్పుకాదా! దాంతో పొయ్యి వెలిగించలేరా? నీ చేతిలో ఉన్న జ్యోతిని గుర్తించు. నీలో వెలిగే జ్ఞానజ్యోతిని గుర్తించు.
నీవూ, నీ భార్య మీలోని శక్తిసామర్థ్యాలను తెలుసుకొని లోక జ్ఞానాన్ని పొందండి! విద్య నేర్చి వివేక వంతులుగా రాణించండి” అని వెళ్ళిపోయాడు.
విద్యని, వివేకాన్ని, లోకజ్ఞానాన్ని ఆర్జించి ఉత్తమ పౌరులుగా బ్రతకాలని కృతనిశ్చయులైనారు నాగమ్మ, వీరయ్య.
నీతి : విద్య వివేకాన్ని లోకజ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకే ఎంత శ్రమపడి అయినా విద్యను నేర్చుకోవాలి.
also read:
జైసల్మేర్‌కి చేరుకున్న కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా.. రేపే వివాహం..!
tomato sauce : ఆరు నెలలు నిల్వ ఉండేలా టమాటా సాస్ తయారు చేసుకోండి
Jaggery face pack : బెల్లంతో ముఖంపై ముడతలు ఇలా పోగొట్టుకోండి..