Telugu Flash News

Moral Stories in Telugu : విద్య – ఉపయోగం

Moral Stories in Telugu : ఒక గురువు దగ్గర ముగ్గురు శిష్యులు విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉండేవారు. వాళ్ళకి నేర్పవలసిన విద్యలన్నీ అయి పోయాక గురువు వాళ్ళ ముగ్గురికీ మూడు మొక్క జొన్న కంకులు ఇచ్చి  “వీటిని సరిగ్గా ఉపయోగించి లాభం పొందండి” అని పంపించాడు.

ఒక మొక్క జొన్న కంకితో ఎలా లాభం పొందాలో అర్థంకాక ముగ్గురూ ఆశ్రమం వదిలి వెళ్ళిపోయారు.

మొదటి శిష్యుడు మొక్కజొన్నతో ఉన్న ఒకే లాభం దాన్ని తినడం అనుకొని. ఆ మొక్క జొన్నను కాల్చి తినేశాడు.

రెండవ శిష్యుడు తన మొక్క జొన్నను ఉడికించి తినేశాడు.

మూడవ శిష్యుడు ఆ మొక్కజొన్నను ఎండబెట్టి, జొన్నలన్నీ వలిచాడు. వాటిని నాటాడు. రోజూ వాటికి నీళ్ళు పోయసాగాడు. కొన్నాళ్ళకి వంద మొక్కలు మొలకెత్తాయి.

కొన్ని నెలలు గడిచాక ఒక్కో మొక్క నాలుగేసి మొక్క జొన్న కంకుల్ని ఇచ్చింది. వాటిలో కొన్ని తినడానికి ఉంచుకొని, మిగతా వాటిని మళ్ళీ నాటాడు.

అవి ఇంకా కంకుల్ని ఇచ్చాయి. ఇలా నాలుగైదు సంవత్సరాలు గడిచేసరికి ఆ శిష్యుడు యాభై ఎకరాల మొక్కజొన్న పంట వేసే స్థాయికి పెరిగాడు.

పంటను జాగ్రత్తగా చూసుకుంటూ, వ్యవసాయం చేస్తూ చాలా డబ్బు గడించాడు.

ఈ విషయం తెలిసి మిగతా ఇద్దరూ అతని దగ్గరకు వచ్చారు. అతను ఏ విధంగా ఆ స్థాయికి వచ్చాడో తెలుసుకొని తామెంత మూర్ఖపు పని చేశారో అర్ధమై చాలా బాధపడ్డారు.

మూడవ శిష్యుడు వాళ్ళిద్దర్నీ ఓదార్చి, తన పొలం ప్రక్కనే వాళ్ళనీ పని చేసుకొమ్మని సాయం చేశాడు.

చూసారా ! ఒకే రకమయిన వస్తువు వచ్చినా, దానిని వాడే విధానం వలన లాభం ఆధారపడి ఉంటుంది.

నీతి :  సరియైన వస్తువును సరిగా ఉపయోగించితేనే సుఖం కలుగుతుంది.

also read news:

janhvi kapoor Latest hot photos in black dress december 2022

Bigg Boss 6: బాబోయ్ ఇదేం ర‌చ్చ‌.. అర్ధ‌రాత్రి శ్రీహాన్ దుప్పట్లోకి శ్రీస‌త్య..!

Exit mobile version