Telugu Flash News

moral stories in telugu : ఇద్దరు అన్నదమ్ముల కథ

moral stories in telugu

moral stories in telugu : ఒక ఊళ్ళో ధనయ్య, దానయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ధనయ్యకు ధనమంటే ఆరోప్రాణం. దానికి తోడ ‘ఆత్మస్తుతి’ ఎక్కువ. అందరి వస్తువులను, భూములను కాకు పెట్టుకొని ఇవ్వాల్సిన దాంట్లో సగమే ఇచ్చేవాడు. డబ్బు కోసం జలగలాగా రక్తం పీల్చేవాడు. ధనయ్య తమ్ముడు దీనికి పూర్తిగా వ్యతిరేకం. ధనయ్య ఉత్తరధృవం అయితే దానయ్య దక్షిణ దృవం, న్యాయమైన సొమ్ము నట్టింట నిలుస్తుందని నమ్మేవాడు దానం చేస్తే తరిగేది ధనమని ధనయ్య తలిస్తే దానం చేస్తే పెరిగేడి విద్య అని దానయ్య మతం.

తామర పుష్పానికి బురద అంటనట్లు ఏ ప్రలోభాలు దానయ్యని అంటలేక పోయాయి. ఒకరోజు ధనయ్యకో బుద్ధి పుట్టింది. తన దగ్గర తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలన్నిటిని కరిగించి బంగారు దిమ్మగా చేసి భూమిలో పాతేశాడు. ఆ ధనము, నగలు అన్నీ దానధర్మాలకు వినియో గించాను. అనాధశరణాలయాలకు దానం చేశాను అని నమ్మించ బోయాడు. దానయ్య మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటవు అనుకుని అన్న అబద్ధాలకు తమ్ముడు బాధపడ్డాడు.

నిన్ను నువ్వు పొగుడుకోకు అని హెచ్చరించాడు. నెలకోమాటు దాచి పెట్టిన చోటుని తవ్వి బంగారు దిమ్మని చూసుకొని తృప్తి పడేవాడు. ఒక మాటు అలా తవ్వుకొని చూసుకుంటున్న రాత్రి సమయంలో ఆ దేశపురాజు, మంత్రీ ప్రజల యోగక్షేమలు తెలుసుకోవాలని మారువేషాల్లో తిరుగుతూ ధనయ్యను చూశారు. వెంటనే కోటకి తీసుకెళ్ళి మర్నాడు న్యాయస్థానంలో విచారించి చెరసాలలో పెట్టారు. రాజు తలుచు కుంటే దెబ్బలకు కొదవా !’ చెరసాలలో ధనయ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు.

ఇది తెలిసిన దానయ్య కాగల కార్యం గంధర్వులే తీర్చారు అనుకొని అన్నను చూడబోయాడు. కాళ్ళ పడ్డ పాము కరవక మానుతుందా! అందరి శాపనార్ధాలు ఉసురు కొట్టుకొని నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయి అని కోప్పడి రాజుగారి దగ్గరికి వెళ్ళి మా అన్న మొదటి తప్పు కాయండి. ఇంకేనాడు పరుల సొమ్ముకి ఆశపడడు.

నేను హామీగా ఉంటాను అని హమీ పత్రం వ్రాసి విడిపించు కున్నాడు. అన్నా! బంగారు దిమ్మ పోయిందని బాధపడకు. అది చేరవలసిన చోటుకే చేరింది. ప్రజలకు ఉపయోగపడుతుంది. చూసు కోవటానికి బంగారు దిమ్మ అయితేనేం? బండరాయి అయితేనేం. ఇదుగో ఈ బండరాయిని పాతేయించాను నిత్యం చూసుకో! అన్నాడు దానయ్య. తమ్ముడా! ఇప్పటికే తల వాలిపోయింది చచ్చిన పామును చంపకు అన్నాడు.

నీతి : అన్యాయార్జితం అయితే రాజులపాలు కాకపోతో దొంగలపాలు

also read :

beauty tips : రూపాయి ఖర్చు లేకుండా అందమైన ముఖం మీ సొంతం.. చిట్కాలివే..

The elephant whisperers: ఆస్కార్ తెప్పించిన ఏనుగులు మాయం.. ఏం జ‌రిగిందంటూ అంద‌రిలో చ‌ర్చ‌

Sreemukhi Latest Hot Photos, Images, Stills, pictures 2023

 

Exit mobile version