Telugu Flash News

moral stories in telugu : కాకి – హంస

moral stories in telugu

moral stories in telugu :అడవిలో ఒక రావిచెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకుని ఉండేది. దాని కింద సరస్సులో ఒక హంస నివాసముంటూ ఉండేది. కాకికి హంసను చూస్తే చాలా ఈర్ష్యగా ఉండేది. కాకి బొగ్గులా నల్లగా ఉండేది. హంస తెల్లగా చాలా అందంగా ఉండేది. కొంత కాలం గడిచిన తరువాత ఆ అడవిలో ఒక వేటగాడు వేటకు వచ్చి ఒక్క జంతువుకూడా దొరకపోవటంతో సరస్సున ఉన్న చెట్టుకింద విశ్రాంతిగా కూర్చుని అలానే నిద్రలోకి జారిపోయాడు. అలసిపోయి ఉండటం వల్ల చెమటతో ఆయనకు నిద్రపట్టేసింది.

చెమటతో తడిసి ఉన్న ఆ వేటగాడిని చూడగానే హంసకు జాలివేసి సరస్సు నుంచి బయటకు వచ్చి తన రెక్కలతో ఆ వేటగాడికి వింజామరలు విసరటం మొదలుపెట్టింది. ఇంతలో కాకిచెట్టుపై నుంచి ఈ దృశ్యాన్ని చూసి ఎలాగైనా ఈ రోజు హంసమీద ఉన్న ఈర్ష్యను బయట పెట్టడానికి చెట్టుపై నుంచి రెట్టవేసింది. వెంటనే మెలకువ వచ్చిన వేటగాడు రెక్కలు విప్పిన హంసను చూసి అదే రెట్ట వేసిందని వెంటనే బాణం వేసాడు. హంస విలవిలా తన్నుకుని మరణించింది. నిస్వార్థంగా సేవ చేసిన హంస బలైపోయింది. కాకి ఎగిరి పోయింది.

నీతి : సజ్జనులు కూడా ఒక్కొక్కప్పుడు కుయుక్తులకు బలి అవుతారు. అందుకే తస్మాత్ జాగ్రత్త.

also read :

Adipurush: ఆదిపురుష్ ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల‌.. దెబ్బ‌కు క్రేజీ హైప్ వ‌చ్చేసిందిగా..!

Horoscope (22-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

akshaya tritiya : అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొంటే శ్రేయస్కరం!

 

Exit mobile version