moral stories in telugu : ఒక ఊళ్ళో ఒక అందాల ఆవుకు ముద్దులు మూట కట్టే చిన్న లేగ దూడ ఉంది. ఆ తువ్వాయి గెంతుతూ ఆడుతుంటే తల్లి ప్రేమగా దాని ఒళ్ళు నాకేది. ఒక రోజు ఆవు గడ్డికోసం చాలా దూరం వెళ్ళి త్రోవతప్పి అడవిలోకి వెళ్ళింది. ఇంతలో ఒక పెద్దపులి గాండ్రు గాండ్రు మంటూ ఆవు దగ్గరికి వచ్చి “దోవ తప్పావు ! ఆవూ! నా అదృష్టం పండింది. నిన్ను తినేస్తా అని గాండ్రించింది. ఆవుకి తన ప్రాణం పోతుందన్న భయం కంటే తను చనిపోతే ‘తువ్వాయి’ ఆకలితో ఉంటుందనే బెంగ ఎక్కువయింది.
భయాన్ని అణుచుకుని ధైర్యం తెచ్చుకొని పులికి నమస్కరించి “పులిరాజా! ఒక్క క్షణం ఆగి నేను చెప్పేది విను! వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగ పడక వివరింపదగున్” అన్నారు కదా! అంది.
మీరందరూ కలకాలం సుఖంగా ఉండండి” అని దీవించి పంపింది పెద్ద మనస్సు గల పెద్దపులి.
‘సరే చెప్పు’ అంది పులి “ రాజా ! నాకొక చిన్న తువ్వాయి ఉంది. దానికి కడుపునిండా పాలు ఇచ్చి తప్పక వస్తాను. నామాట నమ్ము. మోసం చేయను” అంది. “ఏం ఆవూ ! మీ జాతి మంచిదని, అమాయకమైనదని విన్నాను. నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా!” అని మళ్ళీ గాండ్రించింది. “ పులిరాజా ! నా ప్రాణం కంటే మిన్న అయిన నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను. నేను మాట తప్పను” అంది.
“సరే! నీ నిజాయితీ ఎమిటో చూస్తాను. త్వరగారా! రాకపోయావో మూడుతుంది” అని మెత్తగా గాడ్రించింది. ఆవు పరుగు పరుగున ఇంటికి వెళ్ళి తువ్వాయికి కడుపు నిండా పాలు పట్టి ముద్దులు పెట్టి సుద్దులు చెప్పింది. “బిడ్డా! జాగ్రత్తగా ఉండు! అందరితో స్నేహంగా ఉండు! మంద వదిలి దూరంగా వెళ్ళకు ! ” అంది. అమ్మా ! నిన్ను వదిలి నేను బ్రతకలేను. నాకు బుద్దులు చెప్పేవారు ఉండరు. సన్మార్గంలో నడిపే వారుండరు.
తల్లి ప్రేమను మించినదీ లోకంలో లేదు” అంది. గోపరివారమంతా “గోమాతవి నువ్వు లేంది మేము బ్రతకలేము పదండి అందరం పోదాం” గోవులన్నీ అన్నాయి. అడవికి చేరుకున్నాయి. “పులిరాజా! మేము వచ్చేశాం! మమ్మల్ని తిని నీ ఆకలి తీర్చుకో” అంది ఆవు. ఆవు నిజాయితీకి, బిడ్డ మీదతల్లికి, తల్లి మీద బిడ్డకి ఉండే మమకారానికి, ప్రాణత్యాగానికి సిద్ధపడిన గోపరివారాన్ని చూసి పులి మనస్సు ‘వేడి అన్నం మీద వెన్నలా’ కరిగింది. “మీ త్యాగగుణం, ఐకమత్యం, ప్రేమ, ఆపేక్షలు, ముఖ్యంగా నీ నిజాయితీ నన్ను కరిగించింది.
నీతి : మాటకి కట్టుబడి ఉండటం సద్గుణం. అదే మనలను రక్షిస్తుంది.
also read :
Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
Rashmika : రష్మికకి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ పంపిన అభిమాని.. తెగ ఎమోషనల్ అయిన నేషనల్ క్రష్
prostate cancer : ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్స ఇలా..