Homeviral newsViral video : కోతి బ‌ట్ట‌లు భలే ఉతికేస్తుందిగా.. ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్స్

Viral video : కోతి బ‌ట్ట‌లు భలే ఉతికేస్తుందిగా.. ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్స్

Telugu Flash News

Viral video : కోతులు అచ్చం మ‌నుషుల మాదిరిగానే ప్ర‌వ‌ర్తిస్తాయ‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు కోతి పనులు చేయొద్దని పెద్దలు అప్పుడ‌ప్పుడు హెచ్చరిస్తుంటారు. అల్లరికి, చిలిపి చేష్టలకు కోతులు బ్రాండ్ అంబాసిడర్లుగా మ‌రాయి. ఒక్కోసారి అవి మ‌నుషుల మ‌దిరిగా కొన్ని ప‌నులు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా ఓ వీడియో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా, ఇందులో ఓ కోతి అచ్చం మనిషి చేసినట్లుగా చేస్తోంది. మనుషులు బట్టలు ఉతికినట్లుగా ఈ వానరం కూడా ఉతుకుతుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

భ‌లే కోతి..

మామూలుగా బట్టలు ఉతికినప్పుడు మనం బట్టలకి సబ్బు రాసి ఆ తర్వాత ఉతుకుతాము. బ్రష్‌తో కూడా క్లీన్ చేస్తాము. ఈ కోతి కూడా సేమ్ అలాగే ఉతుకుతోంది. పైపైన కాకుండా.. బ్రష్ వాడి మరీ ఉతకడాన్ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. నిజానికి ఈ వీడియో నమ్మశక్యంగా లేదని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జంతువులు తరచూ మనల్ని సర్‌ప్రైజ్ చేస్తుంటాయి అని మ‌రో యూజ‌ర్ ఈ వీడియోకి కామెంట్‌గా పేర్కొన్నాడు. ఈ మ‌ధ్య కోతులు అచ్చం మ‌నుషులు మాదిరిగానే ప్ర‌వ‌ర్తిస్తున్నాయి.

మనిషి లాగా ఫోన్‌లో చూడడం, బట్టలు ఉతకడం, మనిషికి సాయం చేయడం లాంటి వాటిని మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో కోతి బట్టలు ఉతకడం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. కోతులు పలు చోట్ల అమ్మాయిల కళ్లజోళ్లు, టోపీలు ఎత్తుకుపోయి చెట్లు ఎక్కిన వైనాన్ని మనం చూసి ఉంటాం.ఇలాంటివి సినిమాలలోనూ సన్నివేశాలు పెడుతున్నారు. కాని నిజ జీవితంలో కూడా ఇలాంటివి జ‌రుగుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by 🆅🅸🅺🅰🆂 (@ankit_ang_11)

also read:

Bala Krishna: నాపై పుకార్లు పుట్టించే ద‌మ్ము ఎవ‌డికైన ఉందా.. బాల‌య్య కూల్ వార్నింగ్‌

-Advertisement-

Twitter: ట్విట్ట‌ర్‌లో నా ఉద్యోగం ఊడింది అంటూ సంతోషం.. ఎలోన్ మస్క్ కి కౌంట‌ర్ మాములుగా లేదుగా..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News