Mohan Babu: సినీ ఇండస్ట్రీలో స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్న చాలా మంది స్టార్స్ ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులని చవి చూశారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కూడా కెరీర్ మొదట్లో ఎన్ని కష్టాలు పడ్డారో మనందరికి తెలిసిందే.
ఇక ఆదివారం మోహన్ బాబు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో తనకు సినీ కెరీర్ లో ఎదురైన అనుభవాలని చెప్పుకొస్తూ..తనకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు మోహన్ బాబు.
సినిమా కెరీర్ లో ఎదురైన ఇబ్బందుల వల్ల నా ఇల్లు కూడా అమ్ముకోవల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు. వాటితో పాటుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తెలియజేశాడు మోహన్ బాబు.
ఇక తన ఫ్యామిలీ నుండి ఇటీవల వచ్చిన సన్నాఫ్ ఇండియా, జిన్నా సినిమాలు పరాజయం పాలైన విషయాన్నిమోహన్ బాబు అంగీకరించారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం-నరకం’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన మోహన్ బాబు ఆ తర్వాత కెరీర్‌లో మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు.
also read :
Biryani ATM : నోరూరించే వేడి వేడి బిర్యానీ వచ్చేస్తుందిలా.. బిర్యానీ ఏటీఎం విశేషాలు