HomecinemaMohan Babu: మోహ‌న్ బాబు బ‌ర్త్ డే వేడుక‌ల్లో కొత్త కోడ‌లు తెగ హంగామా చేసేసిందిగా..!

Mohan Babu: మోహ‌న్ బాబు బ‌ర్త్ డే వేడుక‌ల్లో కొత్త కోడ‌లు తెగ హంగామా చేసేసిందిగా..!

Telugu Flash News

Mohan Babu: క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఆదివారం 71వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు శుభాకాంక్షలు తెలియ‌జేశారు.మ‌రోవైపు ఆయ‌న బ‌ర్త్ డే వేడుక‌లు కూడా గ్రాండ్‌గా జ‌రిగాయి. మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో కొత్త కోడలు మౌనిక రెడ్డి అన్నీ తానై వ్యవహరించినట్లుగా ఫొటోల‌ని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది.. కుటుంబ స‌భ్యులు అంద‌రు గుడికి వెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. వాటికి సంబంధించిన ఫొటోల‌ని మంచు విష్ణు భార్య‌, మంచు ల‌క్ష్మీ త‌మ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

మార్చి 3న మంచు మ‌నోజ్, మౌనికా రెడ్డి వివాహం జ‌ర‌గ‌గా, ఈ వివాహం మోహన్ బాబుకు ఇష్టం లేదన్న ప్రచారం జరిగింది. మోహన్ బాబు, విష్ణు వేడుకలకు దూరంగా ఉన్నారని, అందుకే మంచు లక్ష్మి ముందుండి మనోజ్ వివాహం చేసిందని ఏవేవో పుకార్లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే మనోజ్ పెళ్లి ముహూర్తానికి కొన్ని గంటల ముందు మోహన్ బాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంచు విష్ణు మాత్రం అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. టైంకి వ‌చ్చి వెంట‌నే వెళ్లిపోయారు. అయితే మోహన్ బాబు జన్మదినం వేళ కోడలితో మోహన్ బాబు సంతోషంగా ఉన్న‌ట్టు క‌నిపించింది.

also read:

Biryani ATM : నోరూరించే వేడి వేడి బిర్యానీ వచ్చేస్తుందిలా.. బిర్యానీ ఏటీఎం విశేషాలు

Prabhas: ప్ర‌భాస్‌పై ప్లాన్ ప్ర‌కార‌మే ఇలా నెగెటివ్ ప్ర‌చారం చేస్తున్నారా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News