Manchu Manoj : మంచువారబ్బాయి మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించి కొన్నాళ్లుగా అనేక పుకార్లు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పుకార్లు నిజమయ్యాయి. ఎట్టకేలకు ఈ జంట శుక్రవారం రాత్రి మంచు లక్ష్మి నివాసంలో జరిగిన పెళ్ళి వేడుకలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగినప్పటికీ మంచు మనోజ్ పెళ్లి వేడుక మాత్రం వైభవంగా జరిగింది. అయితే మోహన్ బాబుకి ఈ పెళ్లి ఇష్టం లేదని ,ఈ పెళ్లి వేడుకకి హాజరయ్యేందుకు కూడా అయిష్టంగా ఉన్నారని కూడా ప్రచారం జరిగింది.
ఆ పుకార్లకు చెక్ పెడుతూ మోహన్ బాబు దంపతులు చిన్న కొడుకు పెళ్లి వేడుకలో సందడి చేస్తూ కనిపించారు. అలానే నవ దంపతులకి ఆశీర్వచనాలు అందించారు. మంచు మనోజ్ పెళ్లి కి హాజరైన వారిలో ఆయన సోదరుడు మంచు విష్ణు దంపతులతో పాటు టాలీవుడ్ నుండి డైరెక్టర్ బాబీ, సింగర్ సునీత, వెన్నెల కిషోర్, బిఎస్ రవి, తేజ సజ్జా లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
2015లో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే యువతని ప్రేమించి వివాహం చేసుకోగా, మనస్పర్ధల వలన విడాకులు తీసుకున్నాడు.
Manchu Manoj and Bhuma Mounika Reddy Wedding Photos