ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (delhi liquor scam case) లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు ఈడీ నోటీసులు జారీ చేసిన ఈడీ.. విచారణకు రావాలని సూచించింది. తొలుత ఈనెల 10న మహిళా బిల్లుపై తాను ఢిల్లీలో దీక్ష చేస్తానని కవిత ప్రకటించారు. అయితే, 9వ తేదీన విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. తాజాగా ఈ కేసు పరిణామాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కవిత.. పలు ప్రశ్నలు సంధించారు. మహిళలను ఇంటికి వచ్చి విచారణ చేయాలని చట్టం చెబుతోందని.. అయితే, అందుకు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు.
ఈడీ విచారణకు రెండు రోజుల సమయం అడిగామని కవిత చెప్పారు. తమకు రెండు రోజుల సమయం ఇస్తే ఈడీకి వచ్చిన నష్టమేంటని ఆమె ప్రశ్నించారు. తమఇంటికి వచ్చి విచారణ చేయాలని ఈడీని కోరినట్లు కవిత చెప్పారు. అయితే, ఈడీ దీనికి అంగీకరించలేదన్నారు. మహిళలను ఇంట్లో విచారించాలని చట్టం చెబుతోందని, ఇది తన ఒక్కరి సమస్య కాదన్నారు.
విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కవితకో రారు. అధికారంలో లేని రాష్ట్రాల్లో మోదీ కంటే ముందు ఈడీ వస్తోందని దుయ్యబట్టారు. గాంధీ పుట్టిన దేశంలో అబద్ధాలు పరిపాలన సాగిస్తున్నాయని చెప్పారు. మోదీ బయటే కాదు.. పార్లమెంట్‌లోనూ అబద్ధాలు చెప్తున్నారన్నారు. ధర్మం ఎటువైపు ఉంటే వాళ్లదే విజయం అని కవిత చెప్పుకొచ్చారు. జైళ్లలో పెట్టినంత మాత్రాన కృష్ణుడు జన్మించడం ఆగలేదంటూ పురాణాలు సైతం వల్లె వేశారు కవిత. అజ్ఞాతవాసం తర్వాత అర్జునుడు విజయం సాధించాడని గుర్తు చేశారు. ఈడీ ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతానన్నారు. తాము బీజేపీ బీ టీమ్ అయితే.. ఈడీ ఆఫీసుకు ఎందుకు వెళ్తున్నామని ప్రశ్నలు గుప్పించారు.
also read :
heat stroke : వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఎలా?
RRR: కవలలు సైతం ఇలా చేయలేరంటూ రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై గరికపాటి ప్రశంసలు