MLC Kavitha comments on Delhi liquor scam News
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) లో తాజాగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(manish sisodia) అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వరుసగా అరెస్టు చోటు చేసుకుంటున్నాయి. రెండు నెలల కిందట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు వచ్చి విచారణ చేశారు. ఈ కేసులో కవిత పేరును ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు సీబీఐ అధికారులు. ఈ నేపథ్యంలో తదుపరి అరెస్టు కవితదే అంటూ రాజకీయంగా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు కవిత అరెస్టవుతారంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అధికార పార్టీ నేతలు బీజేపీ నేతలపై మండిపడుతున్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నారు.
అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీ, ఐటీ రైడ్స్ అంటూ హడలెత్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తదుపరి అరెస్టు కవితదేనంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కవిత స్పందించారు.
బీజేపీ వాళ్లు చెబితే అరెస్టులు జరుగుతాయా? అది ఎవరు చేయాలో, ఏ ఏజెన్సీ వారు చేయాలో వారు చెప్పుకోవాలి. వీళ్లు చెప్పి.. వాళ్లు చేస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంతా వాళ్లే ఎక్స్‌పోజ్ చేసుకుంటున్నారు. బీజేపీ వాళ్లకు చెప్పండి.. అలా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇది డెమోక్రసీ. ప్రజాస్వామ్యం అని చెప్పండి… అంటూ కవిత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు చెప్పినట్లుగా చేసుకుంటూ పోతే ఇక దర్యాప్తు సంస్థలు ఎందుకంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ బిల్లును బీజేపీ వెంటనే తీసుకురావాలన్నారు. బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో రెండు సార్లు ఈ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తీరా ఈ మాటను తప్పుతున్నారని మండిపడ్డారు.
ఇందుకు నిరసనగా ఈనెల 10వ తేదీన భారత జాగృతి ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తానని కవిత పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎవరి హక్కులు వారికి రావాల్సిందేనని కవిత కోరారు.
also read :
Bala Krishna: తెలంగాణ యాసలో బాలయ్య.. ఫ్యాన్స్‌కి పూనకాలే..!
sobhita dhulipala : అందంగా లేనని వద్దన్నారు.. కానీ ఇప్పుడు..శోభిత కామెంట్స్