Telugu Flash News

బొన్నీ గాబ్రియేల్‌ : మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కించుకున్న అమెరికా అందగత్తె

Bonney Gabriel

Bonney Gabriel

1. అమెరికా యువతి ఆర్‌ బొన్నీ గాబ్రియేల్‌ 71వ మిస్‌ యూనివర్స్‌గా  విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది.

2. అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఆర్లియాన్స్‌లో మిస్‌ యూనివర్స్‌ 2022 పోటీలు జరిగాయి. 80 దేశాలకు చెందిన అందగత్తెలు పోటీ పడ్డారు.

3. బొన్నీ గాబ్రియేల్‌ను విజేతగా ప్రకటటించగానే 2021 విశ్వ సుందరిగా నిలిచిన హర్నాజ్‌ సంధు.. ఆమెకు కిరీటాన్ని ధరింపజేసింది.

4. అమెరికా టైమింగ్‌ ప్రకారం జనవరి 14న రాత్రి 8 గంటలకు మిస్‌ యూనివర్స్‌ పోటీలు జరిగాయి. గ్రాండ్‌ ఫినాలే విజేతగా నిలిచిన బొన్నీ గాబ్రియేల్‌ అందమైన డ్రెస్‌లో మెరిసింది.

5. వజ్రాలు, క్రిస్టల్స్‌ పొదిగిన గౌను ధరించి ఆమె మిస్‌ యూనివర్స్‌ వేదికపైకి వచ్చింది. ఈ అందాల పోటీల్లో మొదటి రన్నరప్‌గా వెనెజులాకు చెందిన సుందరి అమంద డుడమెల్ నిలిచింది.

6. సెకండ్ రన్నరప్‌గా డొమెనికన్ రిపబ్లిక్‌కు చెందిన ఆండ్రీనా మార్టినెజ్ నిలవడం విశేషం.

7. మనదేశానికి చెందిన కర్ణాటక ముద్దుగుమ్మ.. దివితా రాయ్ ఈ పోటీలో టాప్ 16లో చోటు దక్కించుకుంది.

8. అగ్రరాజ్యానికి చెందిన ఆర్‌.బొన్నీ గాబ్రియేల్‌ 1994 మార్చి 20న టెక్సాస్‌లోని హోస్టన్‌లో జన్మించింది.

9. స్కూల్‌ డేస్‌లోనే వాలీబాల్‌ ప్లేయర్‌గా రాణించిన గాబ్రియేల్‌.. తర్వాత ఫ్యాషన్‌ రంగంపై మక్కువతో ఇటువైపు మళ్లింది.

10. మిస్‌ యూనివర్స్‌ కిరీటం అందుకున్న తొలి ఫిలిప్పినో-అమెరికన్‌గా గాబ్రియేల్‌ నిలవడం విశేషం.

also read :

Santro Ravi : సాంట్రో రవి ఎవరు ? ఇతను చేసిన నేరాలేంటి? ఇప్పుడెందుకు హాట్ టాపిక్ గా మారాడు?

Anasuya: ఓ వ్యాధితో బాద‌ప‌డుతున్న‌ట్టు చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన అన‌సూయ‌

Exit mobile version