Telugu Flash News

Millets : వేసవిలో ఏయే చిరుధాన్యాలు తింటే ఆరోగ్యానికి మంచిదంటే..

millets

వేసవి కాలంలో కూల్‌ డ్రింక్స్‌ అధికంగా తాగడం వల్ల పొట్ట పాడవుతుంది. అయితే, ప్రత్యామ్నాయాలు ఏవి తీసుకోవాలని చాలా మందికి సందేహం కలుగుతుంటుంది. చిరుధాన్యాలు (millets) సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటి ప్రయోజనాలు అందరూ తెలుసుకోవాలి. 2023 ఏడాదిని మిల్లెట్‌ నామ సంవత్సరంగా కేందర ప్రభుత్వం ప్రకటించింది. వాటి విలువను, ప్రయోజనాలను తెలియజేస్తోంది.

రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, కొర్రలు వంటివి చిరుధాన్యాల కిందకు వస్తాయి. పూర్వ కాలంలో వరి అన్నం కాకుండా మిల్లెట్స్ తినేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. రోజూ మిల్లెట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. శరీరంలో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రించవచ్చు.

jowar millets : ఎముక‌లు బ‌లంగా ఉండాలంటే జొన్న‌లు తిన‌డం మంచిది..!

కొన్ని రకాల అనారోగ్యాలు ఉన్న వారు మిల్లెట్స్‌ను తీసుకోరాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, మిల్లెట్స్ తినేటప్పుడు నీరు బాగా తాగాలంటున్నారు.బాగా ఉడికించిన తర్వాత మిల్లెట్స్‌ను తీసుకోవాలి. వెదర్‌ను బట్టి ఏ రకమైన మిల్లెట్‌ను తీసుకోవాలనేది నిర్ణయించుకోవాలి.

వేసవిలో జొన్నలు, రాగులు, ఫాక్స్‌టైల్ మిల్లెట్, బార్న్యార్డ్ మిల్లెట్, కోడో తింటే అనారోగ్యం దరిచేరదు. ఇవి చల్లదనం అందిస్తాయి. మనదేశంలో వర్షాకాలంలో 8 రకాల మిల్లెట్స్‌ను పండిస్తారు. లిటిల్ మిల్లెట్, ప్రోసో మిల్లెట్ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిని ఎండాకాలంలో తింటే మంచిది.

Exit mobile version