Telugu Flash News

Milk Shake : పండ్లలో పాలు కలిపి తీసుకుంటే ప్రమాదమా ? మిల్క్ షేక్ ప్రేమికులు జర జాగ్రత్త!

milk shake

Milk Shake : ఈ ఏడాది వేసవి ఇబ్బంది కలిగిస్తోంది. విపరీతమైన ఎండాకాలం, ఎండవేడిమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాతావరణంలో సాధారణంగా శీతల పానీయాలకు డిమాండ్ పెరిగింది. పండ్ల రసాలు, షేక్స్ మరియు స్మూతీస్ కూడా ప్రజలు తాగుతుంటారు. ఈ వేసవిలో శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు అందరూ డ్రింక్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే వాటిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ తదితర పోషకాలు శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అయితే రోజూ తీసుకుంటే యాక్టివ్ గా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా వేసవి అనగానే మనకు గుర్తొచ్చే పండు మామిడి. వీటితో మిల్క్ షేక్స్ కూడా తయారు చేస్తారు. బనానా షేక్‌ని కూడా ప్రజలు విరివిగా వినియోగిస్తారు. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్.. అన్ని పండ్లను కలిపి నిజమైన పాలతో షేక్స్ తయారు చేయవచ్చా? ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్ని పండ్లలో పాలు కలిపి తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. స్లో పాయిజన్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆయుర్వేదం ప్రకారం, సాధారణంగా అన్ని రకాల పండ్లను పాలతో కలపడం మానుకోవాలని సూచించారు. బదులుగా, తీపి మరియు పూర్తిగా పండిన పండ్లు పాలతో కలపడానికి అనుకూలం అని చెప్తున్నారు. మామిడిపండు, అరటిపండు రెండూ తియ్యగా ఉంటాయి.. అందుకే చాలా మంది అల్పాహారంగా మామిడి, అరటిపండు మిల్క్ షేక్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే నిజానికి ఈ రెండూ ఆరోగ్యానికి మంచివేనా ?

పండ్ల విషయానికొస్తే, మామిడిపండ్లు మరియు అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. కానీ మామిడికాయ మాత్రమే పాలతో కలిపి తీసుకుంటే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అరటిపండు తియ్యగా ఉండవచ్చు కానీ జీర్ణమైన తర్వాత పుల్లగా మారుతుంది. పాలలో కలిపినా ఉపయోగం ఉండదని.. అందుకే రెండింటినీ కలపకూడదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మితంగా తీసుకోవడం ఓకే . కానీ ఎక్కువగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

read more :

Bone health : ఎముకల పటుత్వం కోసం తినాల్సిన ఆహారాలు ఇవే..

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

Exit mobile version