lionel messi: ఒకే ఒక్క మ్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ ఎలా అయితే రికార్డులతో అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడో మెస్పీ కూడా అంతే. ఇక ప్రపంచకప్ విజయాల్లో పోలికలుండడం విశేషం. కాకతాళీయమో ఏమో కానీ జెర్సీ నంబర్ నుంచి ప్రపంచకప్ గెలిచే వరకు ఈ ఇద్దరి మధ్య ఒకే పోలికలు ఉండటం అభిమానులను సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తోంది. క్రికెట్లో సచిన్ పదో నంబర్ జెర్సీని ధరిస్తే.. ఫుట్‌బాల్‌లో మెస్సిది కూడా అదే నంబర్ కావడం విశేషం. 2003లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమితో నిరాశ చెందిన మాస్టర్ బ్లాస్టర్.. ఎనిమిదేళ్ల తర్వాత 2011లో ప్రపంచకప్‌ను దక్కించుకున్నాడు.
ఇలానే 2014లో ఫైనల్లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న మెస్సీ.. ఎనిమిదేళ్లకు ఇప్పుడు వరల్డ్ కప్పును సొంతం చేసుకున్నాడు. 2011 ప్రపంచకప్ సెమీస్‌లో సచిన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకుంటే.. 2022 ప్రపంచకప్‌లోనూ మెస్సీ సెమీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం విశేషం. వేర్వేరు క్రీడల్లో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరున్న ఇద్దరి మధ్య ఇలాంటి పోలికలుండడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఫిఫా ప్రపంచకప్ టైటిల్ లోటును తీర్చుకున్న మెస్సీ.. కెరీర్‌లో అన్ని ఘనతలను సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ప్రపంచకప్ టోర్నీల్లో రెండుసార్లు గోల్డెన్ బాల్ అవార్డు అందుకొన్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు..
ఏడు సార్లు బాలెన్ డి ఓర్ అవార్డు అందుకొన్న మెస్సీఅండర్ -20 ప్రపంచకప్, ఒలింపిక్ గోల్డ్, కోపా అమెరికా, ఫిఫా ప్రపంచకప్ టైటిళ్లు కూడా సాధించి ఔరా అనిపించాడు. అతను ప్రతి గంటకు $8,790 అంటే రూ. 7.25 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. మెస్సీ బార్సిలోనా శివార్లలో ఉన్న అతని $ 7 మిలియన్ల భవనంతో సహా అనేక విలాసవంతమైన ఆస్తులను కూడా కలిగి ఉన్నాడు. అతని ఆస్తిలో ఒక కొలను, ఇండోర్ జిమ్, థియేటర్, స్పా కూడా ఉన్నాయి. మెస్సీ తన కుక్క హల్క్‌తో బయటకు వెళ్లేందుకు ఇష్టపడే ఫుట్‌బాల్ పిచ్ కూడా ఉంది. మెస్సీ అనేక హోటళ్లకు యజమాని కూడా. వంద కోట్ల జెట్‌కి కూడా యజమాని . మెస్సీకి కార్లంటే చాలా ఇష్టం. పగని జోండా ట్రైకలర్, ఫెరారీ F430 స్పైడర్, డాడ్జ్ ఛార్జర్ SRT8, మసెరటి గ్రాన్ టురిస్మో మెస్సీ గ్యారేజీలో ఉన్నాయంట.
also read news:
Thalapathy vijay’s Varasudu Video Song ‘Soul of Vaarasudu (Telugu)’ Released