Telugu Flash News

ఆకాశంలో అద్భుతం.. ఈ ‘అరోరా బొరియాలిస్’ వెరీవెరీ స్పెషల్.. ఎందుకంటే..!?

aurora borealis

అరోరా బొరియాలిస్ అంటే.. అందమైన సహజ దృగ్విషయం. ఇది యుగ యుగాల నుండి ప్రజలను మంత్రముగ్దులను చేస్తున్న కమనీయ దృశ్యం. ఆకాశ వీధిలో అద్భుతమైన గ్రీన్ లైట్‌ వల్ల కనిపించే దృశ్యాలు అదుర్స్ అనిపిస్తాయి.

అమెరికాలోని అలస్కాలో ఉన్న డెనాలి నేషనల్ పార్క్ లో ఈ అందమైన అరోరా బొరియాలిస్ సంభవించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నేషనల్ పార్క్ అధికారిక ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.

ఈ పోస్ట్ దాదాపు 98,000 లైక్‌లను పొందింది. కామెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి.అయితే ఈ పోస్ట్ తో పాటు   నేషనల్ పార్క్ నిర్వాహకులు అరోరాస్ గురించి వివరణాత్మక వర్ణనను కూడా పంచుకున్నారు.

వర్ణన ఇలా ఉంది..

“‘Aurora Borealis!? At this time of year, at this time of day, in this part of the country, localised entirely within your kitchen!?’ – Super Nintendo Chalmers,” అని పేర్కొంటూ నేషనల్ పార్క్ నిర్వాహకులు ది సింప్సన్స్ నుండి ఒక క్లాసిక్ గ్యాగ్‌ని ప్రస్తావిస్తూ రాశారు.

“డెనాలి నేషనల్ పార్క్ అనేది అరోరాను వీక్షించడానికి ఒక గొప్ప ప్రదేశం. ఎందుకంటే ఇది ఉత్తర అక్షాంశంలో ఉంది. చాలా తక్కువ కాంతి కాలుష్యం ఇక్కడ ఉంది. పట్టణాలు, నగరాలు మరియు ఇతర అభివృద్ధి చెందిన ప్రాంతాలలో కాంతి కాలుష్యం చాలా ఎక్కువ..అందువల్ల అక్కడ ఇంత స్పష్టతతో ఆరోరాను చూడలేం ”అని నేషనల్ పార్క్ నిర్వాహకులు తెలిపారు.

“నార్తర్న్ లైట్స్ లేదా అరోరా బొరియాలిస్‌లో కనిపించే అత్యంత సాధారణ రంగు ‘ఆకుపచ్చ’. సౌర గాలి అదే సమయంలో భూమి యొక్క వాతావరణంలోని మిలియన్ల ఆక్సిజన్ అణువులను తాకినప్పుడు, అది ఆక్సిజన్ అణువులను ఒక సారి ఉత్తేజపరుస్తుంది .భూమి నుండి మనం చూడగలిగే ఆకుపచ్చ రంగును విడుదల చేసినప్పుడు అవి వాటి అసలు స్థితికి తిరిగి వస్తాయి. మీరు అరోరా బొరియాలిస్‌ను ప్రత్యక్షంగా చూశారా? ”అని నేషనల్ పార్క్ నిర్వాహకులు వివరించారు.

14 సంవత్సరాల వయస్సులో..

“నేను 14 సంవత్సరాల వయస్సులో న్యూయార్క్‌లోని అప్‌స్టేట్‌లో అరోరా బొరియాలిస్‌ను చూశాను. మేము సరస్సు గుండా వెళుతున్నప్పుడు అది నన్ను మరియు నా కజిన్‌ను చుట్టుముట్టిన ఒక పెద్ద తెల్లటి పంజరంలా ఉంది” అని ఒక Instagram వినియోగదారుడు రాశారు.

“బ్రీత్‌ టేకింగ్లీ బ్యూటీఫుల్… మదర్ నేచర్ లాంటిది ఏమీ లేదు” అని మరొకరు వ్యాఖ్యానించారు.

Exit mobile version