Telugu Flash News

Sri Satya: శ్రీస‌త్య కోసం మెహబూబ్‌ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడా..!

Sri Satya: బిగ్ బాస్ సీజ‌న్ 6 లో కుర్రాల్ల మ‌దిని దోచిన అందాల ముద్దుగుమ్మ శ్రీస‌త్య‌. ఈ సీజ‌న్‌లో అర్జున్ కళ్యాణ్ అయితే శ్రీస‌త్య వెన‌క హ‌చ్ కుక్క పిల్ల‌లా తిరిగాడు.ఇక శ్రీహాన్‌తో ఈ అమ్మ‌డు న‌డిపిన ఫ్రెండ్షిప్ వేరే లెవ‌ల్. అయితే హౌజ్ నుండి బ‌య‌కు వ‌చ్చాక శ్రీ స‌త్య మెహబూబ్‌తో క‌లిసి బీబీ జోడి షో చేస్తుంది. ఈ క్ర‌మంలో శ్రీస‌త్య‌పై మెహబూబ్‌కి ప్రేమ క‌లిగింది. ఫిబ్రవరి 14న లవ్ ప్రపోజల్ పెట్టాడు. నేరుగా శ్రీసత్య వద్దకు వెళ్లి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పక్కనే మెహబూబ్ టీమ్ మెంబర్స్ కూడా షాక్ అయ్యారు.

శ్రీసత్య మొదట దీనిని ఫ్రాంక్ అని భావించింది. అయితే మెహబూబ్ సీరియస్ గా రెండు నెలల నుండి ప్రేమిస్తున్నానని చెప్పడంతో షాక్ అయ్యింది. ఇవేమీ వద్దు. నాకు రిలేషన్స్ సెట్ కావు. ఒకసారి దెబ్బతిన్నాను… నాకు వద్దని శ్రీసత్య వారించ‌గా, ఆమె మాట‌ల‌కి మెహబూబ్ హర్ట్ అయ్యాడు. తన ప్రేమను ఒప్పుకోనందుకు ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీసత్యతో పాటు పక్కన ఉన్న ఇద్దరూ మెహబూబ్ ని ఆపారు. ఒక పది నిమిషాల పాటు ఎంతో హైడ్రామా నడిచింది. వెంటనే మెహబూబ్ జస్ట్ ప్రాంక్ అని చెప్పి షాక్ ఇచ్చాడు. వ్యూస్ కోసం ఇలాంటి చెత్త ప‌నుల‌తో చంప‌కండిరా అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

also read:

Oversleeping : ఎక్కువ నిద్రపోయినా సమస్యలే.. ఈ జబ్బులు సోకే ప్రమాదం!

Viral Video: పెళ్లిలో పన్నీర్‌ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!

Exit mobile version