megha akash marriage news : టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో మేఘా ఆకాష్ ఒకరు. 2017లో లై సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఛల్ మోహన్ రంగ, పేట చిత్రాల్లో నటించింది. అయితే ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ డిజాస్టర్స్ కావడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రంలో నెగిటివ్ రోల్‌లో కనిపించింది.
ఈ సినిమా తర్వాత మేఘా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్స్ అయిందని కోలీవుడ్ ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ విషయాన్ని పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమని తర్వాత అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై మేఘా ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా ఈ బ్యూటీ అరె సినిమాలో నటించింది. హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది. అయితే మేఘాకు ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది.
ఆమె ప్రధాన పాత్రలో నటించిన మనుచరిత్ర సినిమా కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇవి కాకుండా.. మేఘా ఆకాష్ పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే హీరో శర్వానంద్ పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
read more news :
Pushpa 2 : అల్లు అర్జున్ సినిమా లో అర్జున్ దాస్ ?
Tamannaah Bhatia Photoshoot | Jee Karda Web Series