Telugu Flash News

మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్‌ ట్రైలర్‌ వచ్చేసింది.. చిరు కొత్త లుక్ అదిరిందిగా..

godfather trailer

godfather trailer

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గాడ్‌ఫాదర్‌ ట్రైలర్‌ (godfather trailer) వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా మాంచి కంటెంట్‌తో యూట్యూబ్ లో రచ్చ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి (megastar chiranjeevi) హీరోగా మోహనరాజా (mohanraja) దర్శకత్వం వహించిన చిత్రం గాడ్ ఫాదర్.

అక్టోబర్ 5న సినిమా విడుదల కానున్న దృష్ట్యా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన చిత్ర బృందం.. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది. చిరంజీవి యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిరు కొత్త లుక్ ఆకట్టుకుంది.

గాడ్ ఫాదర్.. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా లూసిఫర్ కథలో చాలా మార్పులు చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీ మరియు సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న గాడ్ ఫాదర్ ట్రైలర్‌ను చూడండి..

ఇవి కూడా చదవండి :

Finger millet : ఊబ‌కాయులు బ‌రువు త‌గ్గేందుకు రాగులు ఎంత‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలుసా?

Viral Video: స్కూల్ బ్యాగ్‌లో దూరిన పాము.. తెర‌చి చూసే స‌రికి..

 

Exit mobile version