Megha Akash: నితిన్ లై చిత్రంతో నటిగా పరిచయం అయిన అందాల భామ మేఘా ఆకాశ్. ఛల్ మోహన్ రంగ, డియర్ మేఘా, రాజా రాజా చోర లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్న మేఘా ఆకాశ్… క్యూట్ లుక్స్ తో ఎంతో ఆకట్టుకుంది. తాజాగా మెగా ఆకాష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె అమ్మమ్మ వృద్దాప్య సమస్యలతో మార్చి 1న మరణించడంతో ఎమోషనల్ గా పోస్ట్ షేర్ చేసింది.
అమ్మమ్మ దూరం కావడంతో మేఘా ఆకాష్ కుమిలిపోతూ తన బాధని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. తన హృదయం ముక్కలైంది అంటూ మేఘా ఆకాష్ ఎమోషనల్ గా పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
‘డియర్ అమ్మమ్మ నువ్వు లేకుండా ఎలా బ్రతకను.. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. సాయం అంటూ వచ్చిన అందరి కడుపు నింపిన దయామయురాలివి నువ్వు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్.. నువ్వే నా ఫస్ట్ లవ్.. నేను నీతోనే గాసిప్స్ కూడా మాట్లాడేది. కానీ ఇకపై నీతో మాట్లాడలేను. నీతో ఎన్నో ఆదివారాలు గడిపాను నాకు గుర్తుంది.. ఇకపై ఆయా సరదాలు ఉండవు. నిన్ను మాలోనే చూసుకుంటాం. అంటూ మేఘా ఆకాష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
also read :
Manchu Manoj and Bhuma Mounika Reddy Wedding Photos
Viral video : దానికదే స్టార్ట్ అయిన ట్రాక్టర్.. దెయ్యం తోలిందా? వీడియో వైరల్!