Mega War: ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఉన్నారు. వీరిద్దరు చిరంజీవి ఇన్సిపిరేషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్స్ గా ఎదిగారు. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్-రామ్ చరణ్ మధ్య చిన్న చిన్న విబేధాలు వచ్చాయని సోషల్ మీడియాలో తెగ ప్రచారాలు నడిచాయి.
అయితే ఇన్నాళ్లుగా దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కాని తాజాగా జరిగిన ఉపాసన బేబీ షవర్ వేడుకకు బన్నీ అటెండ్ కావడంతో అవన్నీ తప్పుడు వార్తలే అని తేలిపోయింది.
బేబి షవర్ వేడుకలో ఉపాసనతో తీసుకున్న ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన బన్నీ.. చరణ్-ఉపాసన జంటకు తన తరపున విషెస్ చెప్పాడు.
దీంతో మెగా-అల్లు ఫ్యాన్స్ రామ్ చరణ్, బన్నీ ఒక్కటయ్యారని ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇక ఇదే ఈవెంట్ లో ఉపాసన క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది పాల్గొనగా, వారిలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఉన్నారు.
జూలైలో ఉపాసన పండంటి బేబికి జన్మనివ్వబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె తన విలువైన సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చక్కగా ఆస్వాదిస్తుంది.
కొన్నాళ్ల ముందు దుబాయిలో బేబి షవర్ వేడుక చేసుకున్న ఉపాసన.. హైదరాబాద్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సీమంతం వేడుకలు చేసుకుంటుంది.
also read :
Ajinkya Rahane : టెస్టులకు కూడా పనికిరాడన్నారు.. ఇప్పుడు సిక్సర్ల సునామీ సృష్టిస్తున్నాడు!
Gold Rates Today : ఈరోజు బంగారం, వెండి ధరలు (24-04-2023)