Telugu Flash News

Meena: ఆ హీరో అంటే క్ర‌ష్ అన్న మీనా.. ఆయ‌న పెళ్లి రోజు గుండె బ‌ద్ద‌లైందంటూ కామెంట్

meena

Meena: న‌టి మీనా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 1990లో నవయుగం మూవీతో హీరోయిన్ అయిన మీనా త‌న కెరీర్స లో సౌత్ ఇండియాను ఏలారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక చిత్రాలు చేసిన ఆమె మలయాళ, కన్నడ భాషల్లో కూడా విరివిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయ‌గా, ఈ అమ్మ‌డు మోహన్ లాల్, వెంకటేష్ వంటి హీరోల సరసన ఆమె కీలక రోల్స్ దక్కించుకుంటూ అల‌రిస్తుంది. ఇటీవ‌ల ఆమె భ‌ర్త చ‌నిపోగా, ఆ బాధ‌లో ఉన్నారు. అయితే మీనా ప్రముఖ తమిళ మీడియా ఇంటర్వ్యూలో కీల‌క విష‌యాలు చెప్పుకొచ్చింది.

వివాహం కాకముందు హీరో హృతిక్ రోషన్ అంటే త‌న‌కు క్ర‌ష్ అని, అలాంటి అబ్బాయితో పెళ్లి చేయమని వాళ్ళ అమ్మతో చెప్పాన‌ని పేర్కొంది. ఇక హృతిక్ పెళ్లి రోజు మీనా చాలా ఫీల్ అయింద‌ట‌. ఒక ర‌కంగా తన గుండె బద్దలైందని మీనా ఓపెన్ గా చెప్పారు.

హృతిక్ రోషన్ 2000 సంవత్సరంలో ఫ్యాషన్ డిజైనర్ సుసానే ఖాన్ ని వివాహం చేసుకోగా, 2014లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఇక మీనా విష‌యానికి వ‌స్తే 2009లో బెంగుళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వివాహం చేసుకోగా, గత ఏడాది జూన్ 28న విద్యాసాగర్ అనూహ్యంగా కన్నుమూశారు.

also read :

అదానీ ఇంట్లో పెళ్లి సందడి.. కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం.. కోడలు ఎవరంటే..

moral stories in telugu : ఇద్దరు అన్నదమ్ముల కథ

Exit mobile version