Telugu Flash News

medico preethi case : అసలు ప్రీతి ఆత్మహత్య ఘటనలో ఏం జరిగింది? కీలక అనుమానాలు వెలుగులోకి..

medico preethi case

medico preethi case Latest News : సైఫ్ ర్యాగింగ్‌ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతి ఘటనలో రోజు రోజుకూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్‌ వేగంగా సాగుతోంది. నిందితుడు సైఫ్‌ నుంచి కీలక వివరాలను పోలీసులు ఇప్పటికే రాబట్టినట్లు తెలుస్తోంది.

నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం సాంకేతికంగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ప్రీతి దూరమై ఓవైపు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుంటే మరోవైపు రాజకీయ నాయకులు మాత్రం మాటల యుద్ధం చేస్తున్నారు.

అసలు ప్రీతి ఆత్మహత్య ఘటనలో ఏం జరిగింది? మెడికో ప్రీతి ఇంజెక్షన్‌ తీసుకున్నప్పటి నుంచి ఆస్పత్రికి తరలించే దాకా ఏం జరిగిందనే విషయాలపై లంబాడీల ఐక్య వేదిక పలు అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ మేరకు 11 ప్రశ్నలు లేవనెత్తుతూ మీడియాకు రిలీజ్‌ చేశారు.

ప్రీతి మృతిపై తమ అనుమానాలను ప్రభుత్వానికి విన్నవించారు. ముఖ్యంగా విధి నిర్వహణలో ఉన్న ప్రీతిబాయి అపస్మార స్థితిలో ఉండగా మొదట చూసిందెవరో తేలాలని పేర్కొన్నారు.

అపస్మారక పరిస్థితిలో ఉన్న ప్రీతిబాయి చేయి ఎందుకు కమిలిపోయిందనేది దర్యాప్తులో తేలాలన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న సమయం నుంచి ప్రీతి తండ్రికి ఫోన్‌ వచ్చే దాకా అసలు ఏం జరిగిందో తేలాలన్నారు. ప్రీతి విషయాన్ని వెంటనే ఎందుకు తల్లిదండ్రులకు తెలియజేయలేదో తేలాలని కోరారు.

ఇక ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌లో ఉన్న ప్రీతి మొబైల్‌ డేటాను ఎవరు డిలీట్‌ చేశారో తేలాలన్నారు. అలాగే వారి బ్యాచ్‌మేట్‌లతో చేసిన చాటింగ్‌లు అన్నింటినీ ఎవరు డిలీట్‌ చేశారో తేల్చాలని కోరారు.

ఇక ప్రీతి సెల్‌ఫోన్‌ హిస్టరీని చూడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆమె సెల్‌ఫోన్‌లో డ్రగ్‌ గురించి సెర్చ్‌ చేసిందని ఫేక్‌ ఎవిడెన్స్‌ సృష్టించారని, దానిపైదే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో దర్యాప్తులో తేల్చాలన్నారు.

మరోవైపు ప్రీతి తండ్రి రాకముందే అన్ని డిపార్ట్‌మెంట్ల హెడ్‌లు ఎందుకు వచ్చారని లంబాడీల ఐక్య వేదిక అనుమానాలు వ్యక్తం చేసింది. వరంగల్‌లో ప్రీతికి చేసిన చికిత్స వివరాలు బహిర్గతం చేయాలన్నారు. తర్వాత నిమ్స్‌లో ఎలాంటి చికిత్స చేశారో చెప్పాలన్నారు.

వేధించిన నిందితుడు సైఫ్‌తో పాటు ఈ కేసులో భాగస్వామ్యం అయిన వారి పేర్లను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం ఎందుకు వహిస్తోందని ప్రశ్నిస్తూ లంబాడీల ఐక్య వేదిక ప్రశ్నల వర్షం కురిపించింది.

also read :

Satvik Suicide Case : సాత్విక్‌ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు!

Kiara Advani Latest Photos at WPL Opening Ceremony 2023, Videos

Tamanna Latest Photos, Stills, instagram pics 2023

 

Exit mobile version