సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమకు దారి తీస్తున్నాయి. తర్వాత సహజీవనం చేయడం, మోజు తీరాక ఇక వదిలేయడం నేటి కాలంలో పరిపాటిగా మారిపోయింది. ఇంట్లో వారికి విషయం తెలిశాక పోలీసు స్టేషన్ల మెట్లెక్కడం, కుటుంబం పరువు పోయిందంటూ ఆత్మహత్యలు, హత్యలకు దారి తీయడం.. ఇది ప్రస్తుతం సర్వ సాధారణమైపోయింది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా కుదిరిన స్నేహం.. ప్రేమకు దారి తీసి తర్వాత సహజీవనం చేసిన యువతి కథ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది.
మాజీ ప్రియుడి కోసం ఓ యువతి దుబై నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి తర్వాత మోసగించాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. ఈ కథలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూశాయి. హైదరాబాద్ నగరంలోని బోరబండ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి టెలీకాలర్‌గా ఇక్కడ పని చేసేది. ఈ సమయంలోనే ఇన్‌స్టాలో మహారాష్ట్రలోని జల్‌గావ్‌కు చెందిన సైఫ్ అనే వ్యక్తితో యువతికి పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం అనతికాలంలోనే ప్రేమగా మారిపోయింది. అనంతరం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సైఫ్.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి యువతితో సహజీవనం చేయసాగాడు. అయితే, ఈ విషయం ఇంట్లో వాళ్లకు యువతి చెప్పలేకపోయింది. దీంతో ఆమెకు 2020 కరోనా టైమ్‌లోనే వేరే పెళ్లి చేసేశారు. భర్తతో కలిసి యువతి దుబైకి వెళ్లిపోయింది. కొంత కాలం తర్వాత మళ్లీ యువతితో కాంటాక్ట్‌లోకి వచ్చిన సైఫ్.. హైదరాబాద్ వచ్చేయాలని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
దీంతో ఆ యువతి వెంటనే వెనకా ముందు ఆలోచించకుండా విమానం ఎక్కేసి ప్రియుడి కోసం హైదరాబాద్‌కు చేరుకుంది. తర్వాత ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. ఇలా కొంత కాలం సహజీవనం చేసిన సైఫ్.. తర్వాత ఉన్నట్టుండి చెప్పాపెట్టకుండా స్వగ్రామానికి చేరుకున్నాడు. తాజాగా ఈనెల 22న మరో యువతిని అక్కడ పెళ్లి చేసుకొనేందుకు సిద్ధం కావడంతో సహజీవనం చేసిన యువతికి సమాచారం తెలిసింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకొని నిలదీసింది. సైఫ్ కుటుంబ సభ్యులు యువతిపై మాటల యుద్ధం చేయడంతో చేసేదేమీ లేక యువతి హైదరాబాద్ చేరుకొని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
also read:
Ananya Nagalla Latest Instagram Photos 2023 | Ananya Nagalla Hot