HomecinemaMaruthi: డైరెక్ట‌ర్ మారుతి ల‌వ్ స్టోరీ మాములుగా లేదుగా.. తొలిసారి ఓపెన్ అయిన ద‌ర్శ‌కుడు

Maruthi: డైరెక్ట‌ర్ మారుతి ల‌వ్ స్టోరీ మాములుగా లేదుగా.. తొలిసారి ఓపెన్ అయిన ద‌ర్శ‌కుడు

Telugu Flash News

Maruthi: యూత్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న మారుతి.. ఏకంగా ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం ఆ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న మారుతి తొలిసారి త‌న రియల్ లవ్ స్టోరీని రిలీవ్ చేయడం ఆసక్తికరంగా మారింది. వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘అలా మొదలైంది’ కి డైరెక్టర్ మారుతీ తన భార్య వీనరాగ స్పందన గెస్ట్ లుగా వచ్చి సంద‌డి చేశారు.తాజాగా వీరి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది.

ఇందులో స్పందన మాట్లాడుతూ.. మేమిద్దరం ఒకే స్కూల్ లో చదివాం. ఆయన నా సీనియర్. 8వ తరగతిలో అతని ముఖం న‌చ్చింది. 9వ తరగతిలో టాలెంట్ నచ్చింది. పదో తరగతి వచ్చే సరికి తను వెళ్లిపోయాడు. అయినా లవ్ కొనసాగింది. నన్ను కలిసేందుకు ఆయన ఆర్టీసీ బస్సులో వచ్చే వారు. నేను స్కూటీపై వెళ్లేదాన్ని. అలా మేం ఇద్దరు దొంగతనంగా మీట్ అయ్యి నా స్కూటీపైనే తిరిగేవాళ్లం అని స్ప‌ష్టం చేసింది. ఇక మారుతీ మాట్లాడుతూ.. త‌ను డైరీ లో అన్నీ రాస్తుండేది. ఈరోజు చక్కగా వచ్చాడు.. నుంచి అన్నీ రాసేంది. ఆ డైరీ ఇప్పటికీ అలానే ఉంది. మా టూర్స్ కు సంబంధించిన ప్లానింగ్స్ అంతా త‌న‌దే అని మారుతి అన్నారు. మే9 న ఫుల్ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News