Telugu Flash News

Manasa : పెట్రోల్ పోసుకుని బీడీఎస్ విద్యార్థిని మానస ఆత్మహత్య

manasa

manasa

manasa suicide : ఖమ్మంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నిన్న సాయంత్రం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ పోచమ్మ మైదాన్ కు చెందిన సముద్రాల మానస(22) ఖమ్మంలో మెడిసిన్ చదువుతూ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది.

నిన్న సాయంత్రం కాలిన వాసన వస్తుండటంతో నిర్వాహకులు, తోటి విద్యార్థులు వచ్చి చూడగా ఆమె గదిలో పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమై తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే కాలిపోతున్న మానసపై నీళ్లు పోసి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మానస మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మానస పెట్రోల్ బంకులో పెట్రోల్ కొంటున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మానస తండ్రి ఇటీవల మరణించారు. ఆ బాధ నుంచి తేరుకోలేక తరచు తన తండ్రిని తలచుకున్నట్లుంది. మానసది ఆత్మహత్యేనని భావిస్తున్నామని, ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

read more news :

neelam gill : లియోనార్డో డికాప్రియో భారతీయ సంతతికి చెందిన మోడల్ నీలం గిల్ తో డేటింగ్ చేస్తున్నారా?

Telangana Weather (05-06-2023) : రాష్ట్ర ప్రజలకు కూల్ న్యూస్.. రానున్న 4 రోజులు వర్షాలు

 

Exit mobile version