HomecinemaManobala: ఫేమ‌స్ క‌మెడీయ‌న్ మ‌నోబాల కన్నుమూత‌.. షాక్‌లో సినీ ప్రియులు

Manobala: ఫేమ‌స్ క‌మెడీయ‌న్ మ‌నోబాల కన్నుమూత‌.. షాక్‌లో సినీ ప్రియులు

Telugu Flash News

Manobala: ఇటీవ‌ల ఇండ‌స్ట్రీని చేదు జ్ఞ‌పకాలు వెంటాడుతున్నాయి. చాలా మంది ప్ర‌ముఖులు చిన్న వ‌య‌స్సులోనే అనారోగ్యంతో క‌న్నుమూస్తున్నారు. తాజాగా తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కమెడియన్ మనోబాల కొద్ది సేప‌టి క్రితం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. తమిళ్ తో పాటుగా తెలుగు ప్రేక్షకలను కూడా మనోబాల కన్నుమూయ‌డంతో ఇండ‌స్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మృతి పట్ల తమిళ, తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటుగా అభిమానులు కూడా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

మనోబాల అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఆయన చివరగా తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీలో జడ్జి పాత్రలో కనిపించి అల‌రించారు. 69 సంవత్సరాల మనోబాల గత రెండు వారాలుగా కాలేయ సంబంధిత సమస్యల కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో మ‌నోబాల క‌న్నుమూసారు. శివకార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన డాన్ చిత్రంలో స్కూల్ టీచర్ గా ప్ర‌తి ఒక్కరిని ఎంతగానో న‌వ్వించారు. మనోబాలకు భార్య ఉష మహదేవన్, కుమారుడు హరీశ్ ఉన్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News