మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ (ponniyin selvan) వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా చోళరాజుల చరిత్రాంశంతో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
ఈ సినిమాలో చోళ రాజుల చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారని సెల్వన్ అనే న్యాయవాది చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో విక్రమ్ ఆదిత్య కరికాలన్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమా పోస్టర్‌లో తన నుదుటిన తిలకం ఉందని, అయితే టీజర్‌లో మాత్రం తిలకం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కథ నిజమేంటో తెలియాలంటే తనకు స్పెషల్ షో వేయాలని సెల్వన్ డిమాండ్ చేశాడు. ఈ మేరకు దర్శకుడు మణిరత్నం, ఆదిత్య కరికాలన్ పాత్రలో నటించిన నటుడు విక్రమ్‌లకు నోటీసులు పంపాడు. వీటిపై దర్శకుడు మణిరత్నం స్పందించడం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తలు చదవండి :
prabhas : ప్రభాస్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి – రణబీర్ కపూర్
కాఫీ విత్ కరణ్ షో లో సమంత తన బ్రేకప్ గురించి ఏం చెప్పింది..
ప్రభాస్ ‘సలార్’ నుంచి అదిరిపోయే అప్ డేట్ !