HomenationalNarendra Modi : ప్రధాని పర్యటనలో భద్రతా లోపం.. దూసుకొచ్చిన కార్యకర్త!

Narendra Modi : ప్రధాని పర్యటనలో భద్రతా లోపం.. దూసుకొచ్చిన కార్యకర్త!

Telugu Flash News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కర్ణాటక రాష్ట్ర పర్యటనలో భాగంగా భద్రతావైఫల్యం కనిపించింది. ప్రధాని ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు కాన్వాయ్‌ వైపు దూసుకొచ్చాడు. ఇలా ప్రధాని పర్యటనలో భద్రతాలోపం కనిపించడం మూడు నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రధాని మోదీ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దావణగెరెలో చోటు చేసుకుంది. రోడ్‌ షోలో భాగంగా కాన్వాయ్‌పై వెళ్తున్న ప్రధాని మోదీని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం వేలాది సంఖ్యలో తరలి వచ్చారు.

ఇంతలోనే ఓ యువకుడు అందర్నీ తోసుకుంటూ వచ్చి ప్రధాని వద్దకు వెళ్లేందుకు యత్నించాడు. దాదాపు ప్రధాని కాన్వాయ్‌ వాహనం వద్దకు చేరుకోగానే భద్రతాబలగాలు అప్రమత్తపై ఆ యువకుడిని పట్టుకున్నారు. అంతకు ముందు జనవరిలో కూడా కర్ణాటకలోని హుబ్లీలో ప్రధాని మోదీ రోడ్‌ షో జరిపారు. ఆ సందర్భంలో కూడా ఓ చిన్నారి ప్రధాని వద్దకు వచ్చాడు. ఆరో తరగతి చదువుతున్న చిన్నారి ప్రధానిక మోదీకి పూలమాల వేసేందుకు యత్నించాడు. అనంతరం అప్రమత్తమైన ఎస్పీజీ జవాన్లు పిల్లవాడిని అడ్డుకొని పక్కకు పంపేశారు. తాజాగా ఈ ఘటన జరిగింది.

ఇలా మూడు నెలల వ్యవధిలోనే రెండుసార్లు ప్రధాని పర్యటనలో భద్రతాలోపం కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాజాగా ప్రధాని వద్దకు దూసుకెళ్లిన యువకుడు బీజేపీ కార్యకర్తగా గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కొప్పల్‌ మండలానికి చెందిన ఆ యువకుడిని చొరబాటుదారుడిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇక అతడిపై పోలీసులు ప్రశ్నల వర్షం గుప్పించారు. బారికేడ్లను దాటేందుకు యత్నించిన వ్యక్తిని సీరియర్‌ పోలీసు అధికారి అలోక్‌ కుమార్‌ పసిగట్టి పరుగెత్తి పట్టుకున్నారు.

ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండో కూడా ఆ యువకుడిని అనుసరించారు. ఇక కర్ణాటకలో మోదీ మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రూ.4,249 కోట్లతో 13.71 కి.మీ వైట్‌ఫీల్డ్ నుంచి కృష్ణరాజపురం వరకు మెట్రో లైన్‌ను 12 స్టేషన్‌లతో ప్రధాని ప్రారంభించారు. కర్ణాటకలో మరోసారి గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బడ్జెట్‌లో ఇటీవలే అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు ఉదారంగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే.

also read :

-Advertisement-

CM KCR : మహారాష్ట్రపై ఫోకస్‌ పెంచిన సీఎం కేసీఆర్‌.. నేడు మరోసారి భారీ బహిరంగ సభ

NTR: ఎన్టీఆర్ పిల్ల‌ల‌కు కొత్త బ‌ట్ట‌లు పంపిన స్టార్ హీరోయిన్.. ఆశ్చ‌ర్యంలో ఫ్యాన్స్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News