Telugu Flash News

పెద్దల పంచాయితీ లో వదినను కత్తితో నరికి చంపిన మరిది..

crime news

తెలంగాణలోని హనుమకొండలో దారుణ ఘటన వెలుగు చూసింది. పంచాయితీ పెద్దల ముందే స్వయానా అన్న భార్యపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఇటీవలే అతని సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వదిన బతికి ఉంటే తనకి ఆస్తి రాదు అని భావించి ఆమె పై పగ పెంచుకున్నాడు. ఈ కక్షతోనే పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. ఆ పంచాయతీలోనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ విషయమై సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం

పురాణం జంపయ్య, స్వరూప (35) భార్యాభర్తలు. వీరు ముల్కనూర్ వాసులు. ఫిబ్రవరిలో జంపయ్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి ఆస్తి విషయంలో భర్త తమ్ముడు సమ్మయ్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆస్తిలో వాటాల విషయమై స్వరూప తన తమ్ముడు మోటం గురువయ్య, భార్య తిరుపతమ్మతో కలిసి ఆదివారం పెద్దల సమక్షంలో కూర్చున్నారు. మరిది సమ్మయ్యను కూడా పిలిచారు.

ఈ పిలుపుతో అక్కడికి వచ్చిన సమ్మయ్య.. ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతుండగా.. తన వెంట తెచ్చుకున్న కత్తితో స్వరూపపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పెద్దమనుషులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకపోవడంతో స్వరూప తల, ఇతర శరీర భాగాలను ఇష్టానుసారంగా నరికేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అది చూసి షాక్ తిన్న మిగతా వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు . కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

read more news :

Andhra Pradesh News : వివాహితపై పాస్టర్ అత్యాచారం🤬

Kurnool Crime News : భార్య మహాలక్ష్మి, అత్త హనుమంతమ్మను హతమార్చిన భర్త రమేష్ 🔪

Exit mobile version