టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పుడోకప్పుడు తమకు ధక్కాల్సిన గుర్తింపును పొందుతారు.ఈ మాటనే నిజం చేస్తూ జైల్లోని ఒక ఖైదీ తన పాటతో,తన మధురగానంతో అందరికీ దగ్గరయ్యాడు. నెట్టింట వైరల్ గా మారాడు.అసలు అతనెవరు? జైల్లో ఉన్న ఖైదీ పాట ప్రపంచానికి ఎలా తెలిసింది?ఇవన్నీ తెలియాలి అంటే ఈ స్టొరీ చదవాల్సిందే.
బీహార్లోని కైమూర్ దహ్రాక్ గ్రామానికి చెందిన కన్హయ్యరాజ్ (బీహార్లో మద్యపానం నిషేధం అమలులో ఉండడంతో) తాగి మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణ కారణంగా బక్సర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ రాత్రి జైలులో ఉండి మరుసటి రోజు ఉదయం విడుదలై బయటకు కన్హయ్య వచ్చేసాడు.అయితే అతను బయటకి వచ్చేసిన తరువాత అతని పాట ఫేమస్ అయ్యిందని వాట్సాప్ లో చక్కర్లు కొడుతోందని అతని స్నేహితులు చెప్పడంతో సోషల్ మీడియాలో తన గొంతు విని ఎంతో సంతోషించాడు.
తను అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడన్న విషయాన్ని చెప్పాడు. కన్హయ్యరాజ్ ని మద్యం తాగినందుకు పోలీసులు అరెస్ట్ చేయలేదని, పవన్ సింగ్ (భోజ్పురి హీరో) పాట పాడినందుకు..అతను పాడిన పాటలో ఒక పదం అభ్యంతకరంగా ఉందని ఆ హీరో ఫ్యాన్ ఫిర్యాదు చేసినందుకే తనను అరెస్ట్ చేశారని కన్హయ్య తెలిపాడు.కానీ తను పాడిన పాట వీడియోని కన్హయ్యరాజ్ అప్పుడే డిలీట్ చేశానని వివరించాడు.
ఇక ఆ రాత్రి జైల్లో గడిపిన తను సరదాగా పాట పాడానని, అది ఎవరు వీడియో తీసి ఇలా పోస్ట్ చేశారో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. ఆర్థిక ఇబ్బందులతో చిన్నతనంలోనే చదువుకు దూరం అయ్యానని, రిపబ్లిక్, ఇతర ఫంక్షన్లకు పాటలు కూడా పాడతానని చెప్పాడు కన్హయ్య.
ఇక జైలు వీడియో వైరల్ కావడంతో బాలీవుడ్ సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ అంకిత్ తివారీ తన మ్యూజిక్ ఆల్బమ్ లో పాడేందుకు కన్హయ్యకు అవకాశం ఇస్తానని ప్రకటించగా.. మరోవైపు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి మట్టిలో మాణిక్యాలకు సహాయ పడి వారి టాలెంట్ ను ప్రపంచానికి తెలియ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
అదే విధంగా అతని కుటుంబానికి అవసరమయ్యే సాయం కూడా అందిస్తామని ప్రకటించారు. ఇక తన విడియోను పోస్ట్ చేసి తన ప్రతిభను ప్రపంచానికి తెలిసేలా చేసిన వారికి కన్హయ్య కన్నీళ్ళతో కృతజ్ఞతలు తెలిపాడు.
అదృష్టవశాత్తు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోనని,తన కుటుంబానికి అండగా ఉంటూ తన భవిష్యత్ ని తీర్చిదిద్దుకుంటానని కన్హయ్య అన్నాడు.
Also Read:
Naresh: పవిత్రతో సహజీవనం చేస్తున్న నరేష్ ప్రతి నెల రమ్యకు డబ్బులు పంపుతూనే ఉన్నాడా..!
Veera Simha Reddy telugu movie review : ‘వీర సింహా రెడ్డి’ మూవీ రివ్యూ