అకస్మాత్తుగా, అనుకోకుండా ఏదో జరిగితే అది అదృష్టం అంటారు. ఈ వ్యక్తి విషయంలో అది నిజంగానే జరిగింది. వాకింగ్‌లో వెళుతున్నప్పుడు కాలికి తగిలిన గాజు ముక్కను చూసిన అతడు, అది నిజంగానే గాజు ముక్క అనుకున్నాడు. కానీ, తర్వాత దాన్ని పరిశీలించినప్పుడు అది 4.87 క్యారెట్ల వజ్రం అని తెలిసింది.
ఈ వ్యక్తి పేరు జెర్రీ ఎవాన్స్. అతను అమెరికాలోని అర్కాన్సాస్‌లో నివసిస్తున్నాడు. ఒకరోజు అతను క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌కి వాకింగ్ కోసం వెళ్లాడు. అక్కడ వాకింగ్‌లో వెళుతున్నప్పుడు అతని కాలికి ఏదో గాజు ముక్కలాంటిది తగిలింది. అది చూసిన అతడు, అది నిజంగానే గాజు ముక్క అనుకున్నాడు. అక్కడే వదిలేస్తే మరెవరికైనా గుచ్చుకుంటుందని భావించి, ఆ గాజుముక్కను తన జేబులోనే ఉంచుకున్నాడు.
కానీ, ఆ తర్వాత దాన్ని పరిశీలించగా అది 4.87 క్యారెట్ల వజ్రం అని తేలింది. ఇది పార్కులో ఇప్పటివరకు దొరికిన అతిపెద్ద వజ్రం అని తెలిసింది. పార్క్ ఓపెన్ పాలసీని కలిగి ఉంది. ఇక్కడికి వచ్చే వ్యక్తులు తమకు దొరికిన వజ్రాలను తమ వద్ద ఉంచుకోవడానికి అనుమతిస్తారు.
1972లో స్టేట్ పార్క్ స్థాపించబడినప్పటి నుండి, ఇక్కడ 75,000 కంటే ఎక్కువ వజ్రాలు లభించాయి. ఇన్వాస్‌కు దొరికింది గాజు ముక్క కాదని, వజ్రమని తెలుసుకున్నాడు. అప్పుడు కూడా అతను నమ్మలేదు. జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నుంచి కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్స్టిట్యూట్ దీనిని నిజమైన వజ్రం అని తేల్చింది.
2020 సంవత్సరం ప్రారంభంలో ఒక వ్యక్తి 9.07 క్యారెట్ బ్రౌన్ డైమండ్‌ను కనుగొన్నాడు. దీని తరువాత కూడా పెద్దవి, చిన్నవి అనేక అనేక రకాల వజ్రాలు ఇక్కడ ప్రజలకు దొరికినట్టుగా సమాచారం.
జెర్రీ ఎవాన్స్‌కు దొరికిన ఈ వజ్రం విలువ సుమారు 1.5 మిలియన్ డాలర్లు అని అంచనా. ఈ వజ్రాన్ని అమ్మేందుకు అతను నిర్ణయించుకున్నాడు. అతను దీనిని ఎంతకు అమ్మతాడో చూడాలి.