Kaathal : కోలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అంటే మనకు వెంటనే గుర్తు వచ్చేది సూర్య- జ్యోతిక జంట. పలు సినిమాలలో కలిసిన నటించిన సూర్య-జ్యోతిక రియల్ లైఫ్‌లోను భార్య భర్తలుగా మారారు. ఇక పెళ్లి తర్వాత కాస్త సినిమాలు తగ్గించిన జ్యోతిక ఇటీవల తిరిగి సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది.
‘36 వయదినిలే’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ వచ్చింది. రీఎంట్రీలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్న జ్యోతిక ఇప్పుడు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి పక్కన కథానాయికగా నటిస్తుంది. మమ్ముట్టితో గతంలో నటించే ఛాన్స్ వచ్చిన కూడా పలు కారణాల వలన రిజెక్ట్ చేసింది. ఎట్టకేలకు ఈ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది.
ఈ టైంలోనా…
2000కు అటు ఇటుగా తమిళ సినిమాల్లో ఒక వెలుగు వెలిగి జ్యోతిక కొన్నేళ్ల పాటు నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగింది. తెలుగులో టాప్ స్టార్లయిన చిరంజీవి, నాగార్జున తో ఆమె సినిమాల్లో నటించింది . కెరీర్ ఊపు తగ్గుతున్న టైంలో తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకుంది.
అయితే ఈ అమ్మడు తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మమ్ముట్టితో ఎన్నడూ కలిసి పని చేయని జ్యోతిక ఇప్పుడు ఆయనతో కలిసి కాదల్ అనే సినిమా చేస్తుంది. కాదల్ అంటే ప్రేమ అని అర్థం. ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయగా.. అందులో ఒక నోస్టాలజిక్ ఫీల్ కనిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఫొటోలో మమ్ముట్టి-జ్యోతిక చాలా లవబుల్ కపుల్‌గా కనిపిస్తున్నారు.
ఇక ఫస్ట్ లుక్‌ని సూర్య లాంచ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెప్పడం విశేషం. ఫస్ట్ లుక్ చాలా ఆకట్టుకుంటుండగా, సినిమా కూడా తప్పక అలరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.జియో బేబీ అనే దర్శకుడు తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేమ కథగా రూపొందిస్తున్నారు.
From day one, this film’s idea & every step taken by Dir JeoBaby & team @MKampanyOffl is so good!! Wishing @mammukka , Jo n team the best for @kaathalthecore . Happy happy birthday Jo!!! pic.twitter.com/SnavBrjGGm
— Suriya Sivakumar (@Suriya_offl) October 18, 2022
పెళ్లి అయ్యి పిల్లలు అయ్యాక ఈ స్టేజీలో జ్యోతిక లవ్ స్టోరీలో నటించడం ఏంటని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ చిత్రం ఆయనకు మంచి లాభాలు తీసుకొస్తుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చూడండి :
తీయని పాట మీ గొంతులో పలకాలంటే… ఇలా చేయండి.
రాత్రిపూట తలస్నానం చేస్తే..నష్టమా ? లాభమా ?