Malaika Arora: పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో ఐటెం సాంగ్‌కి చిందులేసి తెలుగు ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ మలైలా అరోరా. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్-మలైకా అరోరా 1998లో ప్రేమ వివాహం చేసుకోగా, కొంత కాలం కలిసి కాపురం చేశారు. మనస్పర్థలతో అనంతరం విడిపోయారు. 2017లో అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి. అర్భాజ్-మలైకాలకు 2002లో అబ్బాయి పుట్టాడు. అతని పేరు అర్హాన్ ఖాన్ కాగా… మలైకా వద్దే పెరుగుతున్నాడు.ఇక మలైకా 2016 నుండి అర్జున కపూర్ తో మలైకా రిలేషన్ లో ఉన్నారు.
49 ఏళ్ల మలైకాతో 37 ఏళ్ల అర్జున్ కపూర్ ప్రేమాయణం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మలైకా అరోరా మాజీ భర్తకు దగ్గరవుతూ కనిపిస్తుంది. ఆసుపత్రిలో పడ్డ సమయంలో అర్భాజ్ ఖాన్.. మలైకాని మంచిగా చూసుకోవడంతో ఇటీవల అతడిపై ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. వీరి కొడుకు అర్హాన్ ఖాన్ విదేశాలకు వెళుతున్నాడు. దీంతో సెండ్ ఆఫ్ చెప్పేందుకు ఇద్దరూ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఈ క్రమంలో మాటలు కలిశాయి. ఫార్మల్ గా విషింగ్ హగ్ ఇచ్చుకున్నారు.
also read:
gobi 65- గోబి 65 పక్కా రెస్టారెంట్ రుచి రావాలంటే ఇలా చేయండి. ఇలా చేస్తే… వెంటనే తినేస్తారు
Jamuna: కొడుకు ఉన్నా కూడా కూతురు చేతుల మీదుగా జమున అంత్యక్రియలు జరపాడానికి కారణం?