Homecinemaమ‌హేష్ బాబు ప్రాప‌ర్టీని ధ్వంసం చేసిన బాల‌య్య ఫ్యాన్స్!

మ‌హేష్ బాబు ప్రాప‌ర్టీని ధ్వంసం చేసిన బాల‌య్య ఫ్యాన్స్!

Telugu Flash News

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ వ‌య‌స్సులోను చాలా ఉత్సాహంగా సినిమాలు చేస్తూ మ‌రోవైపు షోస్ చేసుకుంటూ త‌న అభిమాన గ‌ణాన్ని పెంచుకుంటున్నాడు బాల‌కృష్ణ. ఏదైన ఈవెంట్‌కి వ‌స్తున్నాడు అంటే ఇక అభిమానుల తాకిడి ఏ విధంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.లేటెస్ట్ గా ఈయన కుర్ర హీరో విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకుడిగా మరియు నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చారు. ఈ ఈవెంట్ మ‌హేష్ బాబు ఏఎమ్‌బీ థియేట‌ర్‌లో జ‌రిగింది.

ఈవెంట్ కి బాలయ్య బాబు వస్తున్నాడని అధికారిక ప్రకటన రాగానే నందమూరి అభిమానులు వేలాదిగా గచ్చిబౌలిలోని ఏఎమ్‌బీ సినిమాస్ కి భారీగా తరలి వచ్చారు..బాలయ్య బాబు ఎంట్రీ కోసం..ఆయనని చూడడం కోసం గంటల తరబడి ఆ మాల్ లోనే ఎదురు చూస్తూ ఉండిపోయారు. అయితే ఎప్పుడైతే బాలయ్య బాబు వచ్చాడు అని తెలిసిందో..అభిమానులందరూ ఒక్కసారిగా తోసుకుంటూ వ‌చ్చేసారు. సెక్యూరిటీ గార్డ్ లోపలకి పంపేందుకు షట్టర్ తెరుస్తున్న సమయం లో అభిమానుల అత్యుత్సహం వ‌ల‌న ష‌ట్ట‌ర్ విరిగిపోయింది.

అయితే ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యినందుకు గాను విశ్వక్ సేన్ మానేజ్మెంట్ కి కొంత నష్టపరిహారం చెల్లించిన‌ట్టు టాక్ న‌డుస్తుంది.ఈ విష‌యం తెలుసుకున్న వారు బాలయ్య బాబు మాస్ ఫాన్స్ తో మాములుగా ఉండదుమరి అని అంటున్నారు. అయితే, హీరోల అభిమానులు థియేటర్ల వద్ద తలుపులు, కిటికీలు, గ్లాస్ డోర్స్ వంటికి ధ్వంసం చేయడం కొత్తే విష‌యం ఏమి కాదు. గతంలో కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్స్ గ్లాస్ డోర్స్‌ను ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. థియేటర్‌లోకి ముందుగా వెళ్లాలనే తొందరలో ఇలా జరుగుతూ వ‌స్తున్నాయి.

also read news:

ఆర్సీబీ ఆట‌గాళ్ల కోసం 900 కోట్లు ఖ‌ర్చు చేశారా ?

9 amazing Fruits – know its Nutrition and benefits

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News