Telugu Flash News

Prabhas: షూటింగ్‌లో 300 మందికి ప్ర‌భాస్ ఇంటి నుండే భోజ‌నం.. లీక్ చేసింది ఎవ‌రంటే..!

prabhas

prabhas

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ మంచి భోజ‌న ప్రియుడే కాకుండా చుట్టు ప‌క్క‌ల ఉన్న వారికి క‌డుపు నిండా పెడ‌తాడు. ప్రభాస్ అనగానే స్నేహంతో పాటు ఆయనిచ్చే ఆతిధ్యం గురించి ప్ర‌తి ఒక్క‌రు చెప్పుకొస్తారు. అసలు ఉప్పలపాటి కుటుంబం అంటేనే తిండి పెట్ట‌డంలో టాప్ అని చెబుతుంటారు. తాజాగా జబర్థస్త్ మహేష్.. ప్ర‌భాస్ గురించి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

షూటింగ్ సమయంలో ఆయన తెప్పించిన ఫుడ్ గురించి మాట్లాడిన మ‌హేష్‌.. అందరూ చెబుతుంటే విన్నాను కానీ..తాను లైవ్‌లో చూసి షాక్ అయ్యాను అని చెప్పుకొచ్చారు. ‘షూటింగ్ సమయంలో ..200, 300 మందికి ఫుడ్ తెప్పించారు ప్ర‌భాస్ . అప్పుడు అందరూ కుమ్మేసాం. నేను అయితే మటన్ బాగా తిన్నాను. నన్ను ఏం నచ్చింది రా అని అడిగారు. అప్పుడు మటన్ అన్నా అనగానే..మళ్లీ రేపొద్దున మహేష్‌కు మటన్ తెప్పించండి అని అన‌డంతో తెల్లారి కూడా ఆయనే ఇంటి నుండి మ‌ట‌న్ వ‌చ్చింది. అస‌లు ప్ర‌భాస్ ఆతిథ్యం గురించి ఎప్పుడు విన్నా కాని ఆ రోజు లైవ్‌లో చూశాను. జీవితాంతం ఆయనతో షూటింగ్ ఉంటే బాగుండేది అని అనిపించింది అని మ‌హేష్ చెప్పుకొచ్చారు.

 

Exit mobile version