Homecinemaమహేశ్ తో రాజమౌళి భారీ బడ్జెట్ మూవీ.. ఆర్ఆర్ఆర్ ను మించి !

మహేశ్ తో రాజమౌళి భారీ బడ్జెట్ మూవీ.. ఆర్ఆర్ఆర్ ను మించి !

Telugu Flash News

దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తన లేటెస్ట్ మూవీ గా థియేటర్లకు వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు విజయాన్ని నమోదు చేసుకుంది. రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం మూడు రోజుల్లో రూ. 500 కోట్ల మార్కును దాటేసింది. దీంతో ఆ తరువాత మహేశ్ తో రాజమౌళి చేయనున్న మూవీ గురించి అందరు ఆసక్తికరంగా చర్చించడం మొదలు పెట్టారు.

మహేశ్ బాబు తో రాజమౌళి సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. రాజమౌళికి స్టోరీ లైన్ మాత్రమే చెప్పాననీ, త్వరలో మొత్తం కథను వినిపించనున్నానని అన్నారు. ఇక ఈ మూవీ మల్టీ స్టారర్ కాదనీ, హీరోగా మహేశ్ బాబు మాత్రమే కనిపిస్తాడని రీసెంట్ గా రాజమౌళి చెప్పిన సంగతి మనకు తెలిసిందే. mahesh babu rajamouli movie

ఈ సందర్భంలోనే ఆయన ఈ ప్రాజెక్టు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ కంటే పెద్ద ప్రాజెక్టు అన్నారు. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రం వైపు మళ్లింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం దాదాపు 800 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందనే ఒక అంచనాకి వచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాలో మహేశ్ బాబు జేమ్స్ బాండ్ తరహా స్టైల్ లో చూపించనున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు చదవండి :

Prabhas – maruthi సినిమాలో boman irani కీలక పాత్రలో..

vaani kapoor Latest Photoshoot for Filmfare March 2022

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News