Mahesh Babu: ఎప్పుడు సంతోషంగా , సరదాగా ఉండే మహేష్ బాబు ఇప్పుడు లోలోపల చాలా కుమిలిపోతున్నాడు. అమ్మ చనిపోయిందన్న కారణం ఒకటైతే, చివరి కోరిక తీర్చలేకపోయాననే మరో బాధ మహేష్ బాబుని చాలా కుంగిపోయేలా చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (70) బుధవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీతో పాటు సినీ వర్గాల్లో విషాదం అలుముకుంది. సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్, నటుడు చిరంజీవి, వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్, అశ్వని దత్ వంటి ప్రముఖులు నివాళులు అర్పించారు.
ఈ యేడాది కృష్ణ ఫ్యామిలీలో ఇది రెండో మరణం కాగా, జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసారు. ఆయన ఘటన మరవక ముందే కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నమూయడం అందరిని బాధించింది.
కోరిక అలానే మిగిలింది..
తల్లి ఇందిరాదేవిని చాలా ఇష్టపడే మహేష్ బాబు ఆమెని ఎంతో ప్రాణంగా ప్రేమించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబకు తన తల్లి ఇందిరా దేవి అంటే ఎంతో ప్రాణం. దైవంతో సమానం అంటూ చాలా సందర్భాల్లో కూడా చెప్పారు.
తనకు బాధ అనిపించినా.. సినిమా రిలీజ్ ఉన్నా.. అమ్మ దగ్గరకు వెళ్లి.. ఆమె చేతి కాఫీ తాగడం అలవాటని చెబుతుంటారు. మహేష్ బాబు అమ్మచాటు బిడ్డగా పెరిగారు. మహేష్ స్టార్ హీరోగా ఎదిగిన తరువాత కూడా తనకోసం ఏమి అడగని ఇందిర ఇటీవలి కాలంలో ఒకే ఒక కోరిక కోరిందట. ఆ కోరిక మరెదో కాదు.
తన మనవరాలు, మహేష్ బాబు సితారకు ఓణీల వేడుకు చేయించమని ఇందిరి కోరగా, ఇప్పట్లో ఎందుకు, కాస్త టైం ఉందని మహేష్ లైట్ తీసుకున్నాడట. కాని తన కోరిక తీరకుండానే ఇందిరా దేవి మరణించింది. ఈ విషయం గురించి మహేష్ ఆలోచించి చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
తల్లి మరణంతో పుట్టెడు ధుఖంలో మునిగి ఉన్న మహేష్ ను ఈ బాధ మరింతగా వేధిస్తుందంటూ గుసగుసలు గుప్పుమంటున్నాయి. సితారకు కూడా ఇందిరా దేవి అంటే ప్రాణం. నాన్నమ్మ చనిపోయినప్పుడు చాలా ఏడ్చింది సితార.