HomecinemaMahesh Babu mother : మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి క‌న్నుమూత‌..సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు

Mahesh Babu mother : మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి క‌న్నుమూత‌..సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు

Telugu Flash News

Mahesh Babu mother: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న త‌ల్లి , కృష్ణ స‌తీమ‌ణి ఇందిరా దేవి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. ఫిల్మ్ నగర్, పద్మాలయ స్టూడియో పరిధిలో నివాసం ఉంటున్న ఇందిరా దేవి బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు నెల రోజుల నుండి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఇందిరా దేవి..నిన్న రాత్రి మరణించారు.

మ‌రో విషాదం..

మరోవైపు ఇందిర‌మ్మ‌ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఆమె కృంగి పోయింది. ఈ క్ర‌మంలో కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మూడేళ్ల క్రితం విజయ నిర్మల కన్నుమూయటం ఒక దెబ్బ అయితే.. ఈ యేడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం.. తాజాగా మొదటి భార్య.. ఇందిరా దేవి తుది శ్వాస విడవడం కృష్ణ చాలా కుంగిపోయేలా చేసింది. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

indira devi passed away

koratala shiva at indira devi last rites
mohan babu at indira devi last rites
mohan babu at indira devi last rites
trivikram, thaman at indira devi last rites
trivikram, thaman at indira devi last rites
venkatesh at indira devi last rites

-Advertisement-

అభిమానుల సంద‌ర్శ‌నార్థం ప‌ద్మాల‌య స్టూడియోలో పార్ధీవ దేహాన్ని ఉంచ‌నున్నారు.అనంత‌రం మ‌హా ప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

 

కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు మహేష్ బాబు, రమేష్ సహా ఐదుగురు సంతానం ఉన్నారు. వీళ్లు కాకుండా మరో ముగ్గురు ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగులో హీరోగా నటిస్తున్నారు. ఇక మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం త‌ర్వాత రాజ‌మౌళితో భారీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News