HomecinemaMahesh Babu: మ‌హేష్ బాబు త‌ల్లి వెంటిలేట‌ర్‌పై ఉన్నారా... ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్

Mahesh Babu: మ‌హేష్ బాబు త‌ల్లి వెంటిలేట‌ర్‌పై ఉన్నారా… ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్

Telugu Flash News

Mahesh Babu: సూప‌ర్ స్టార్ కృష్ణ స‌తీమ‌ణి, మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి ఆరోగ్యం విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఆమె హెల్త్ కండిషన్ సీరియస్ అవ్వడంతో ఏఐజి హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న త‌ల్లి గురించి మ‌హేష్ ఎప్ప‌టిక‌ప్పుడు వాక‌బు చేస్తున్నాడ‌ట‌. అయితే ఆమె ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌స్తుతం కుదుటప‌డిన‌ట్టే తెలుస్తుంది. మ‌హేష్ త‌ల్లి ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలుసుకున్న అభిమానులు తెగ కంగారు ప‌డిపోయారు.

ఆరోగ్యం ఎలా ఉంది?

ఇందిరమ్మ, కృష్ణల వివాహం 1961 వ సంవత్సరం లో జ‌ర‌గ‌గా వారికి .. మహేష్ బాబు తో పాటు రమేష్ బాబు మరియు మంజుల ఉన్నారు. ఇక కృష్ణ 1969 సంవత్సరం లో విజయ నిర్మలని రెండవ పెళ్లి చేసుకున్నారు.. విజ‌య నిర్మ‌ల‌ని పెళ్లి చేసుకున్న త‌ర్వాత కూడా ఇందిర‌మ్మతో కొన్ని రోజులు వైవాహిక జీవితం కొన‌సాగించారు కృష్ణ‌.

ఇక ఆ మ‌ధ్య ఇందిర‌మ్మ బ‌ర్త్ డే వేడుక‌ల‌ని ఫ్యామిలీ స‌భ్యులు సెల‌బ్రేట్ చేయ‌గా, ఆ వేడుక‌లో కృష్ణ కూడా సంద‌డి చేశారు. త‌న భార్య‌కి కేక్ తినిపించి మ‌రీ విషెస్ చెప్పారు.ఇక మ‌హేష్ బాబు విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వ‌చ్చే ఏడాది పూర్తి కానుంది.

ఆ త‌ర్వాత రాజ‌మౌళి క్రేజీ ప్రాజెక్ట్ మొద‌లు పెట్ట‌నున్నాడు. త్వరలో ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి వచ్చే యేడాది సమ్మర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు స‌మాచారం. ప్రముఖ హాలీవుడ్ స్టార్ క్రిస్ హేమ్స్‌వర్త్ మహేష్ బాబు, రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కానున్నార‌ని స‌మాచారం.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News