Homecinemaవీడియో : కృష్ణ, మహేశ్ బాబు ఒకే గెట‌ప్స్‌లో అదిరిపోయారుగా...!

వీడియో : కృష్ణ, మహేశ్ బాబు ఒకే గెట‌ప్స్‌లో అదిరిపోయారుగా…!

Telugu Flash News

Mahesh Babu: టాలీవుడ్ లెజెండ్స్‌లో ఒక‌రైన కృష్ణ న‌వంబ‌ర్ 15న క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని విషాదాన్ని మిగిల్చింది.. ఆయ‌న ఇప్పుడు మ‌న మ‌ధ్య‌ లేకపోయినా అతని జ్ఞాపకాలు ఫోటోల, చిత్రాల రూపం లో కళ్ల ముందు మెదులాడుతూనే ఉన్నాయి.. అలాగే కృష్ణ తో పరిచయం వున్న కొంత మంది వ్యక్తులు అతనితో చదువుకున్న వారు తమ తమ జ్ఞాపకాలని ఫోటోల రూపం లో బ‌య‌ట‌కు తీస్తున్నారు. అభిమానులు సైతం అమ అభిమాన హీరోపై ఒక్కో ర‌కంగా ప్రేమ‌ని చూపించుకుంటున్నారు. అభిమానులు కృష్ణకు సంబంధించిన పలు వీడియోలు పోస్టు చేస్తూ ర‌చ్చ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ వీడియో క్రియేట్ చేసి ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుష్ చేశారు. ఈ వీడియోలో కృష్ణ, మహేశ్ బాబులు నటించిన సినిమాల్లోని సేమ్ గెటప్ లను పక్కపక్కనే పెట్టేసి వీడియోని రూపొందించ‌గా, ఇది ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు గెలుచుకుంటుంది. తండ్రి కొడుకుల‌ని ఇలా చూస్తుంటే డ్యూయ‌ల్ రోల్ సినిమాలా క‌నిపిస్తుంద‌ని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వీడియోనే కాక కృష్ణ‌కి సంబంధించిన చాలా జ్ఞాప‌కాలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

బుర్రిపాలెంలో జన్మించిన కృష్ణ.. ఈ స్థాయికి రావ‌డానికి ఎన్నో కష్టాలు పడ్డారు.. అనేక సినిమాలు చేశారు. రైతు నుంచి కౌబాయ్ వరకు అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయన జీవితంలో అల్లూరి సీతారామరాజు గెటప్ ఎప్ప‌టికీ ఎవర్ గ్రీన్. కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలోని కౌబాయ్ గెటప్ వేయ‌గా. ఇదే గెట‌ప్ మహేశ్ బాబు ‘టక్కరి దొంగ’ చిత్రంలో వేశాడు. తండ్రిని స్పూర్తిగా తీసుకొని మ‌హేష్ బాబు మంచి సినిమాలు చేశారు. అయితే ఒకే ఏడాదిలో ఆయ‌న త‌న అన్న‌, త‌ల్లి, తండ్రిని కోల్పోవ‌డం నిజంగా బాధాక‌రం అని చెప్పాలి.

ఇదిలా ఉంటే సుదీర్ఘ కాలం పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కృష్ణ‌.. తన వారసులుగా రమేష్ బాబు, మహేశ్ బాబును హీరోలుగా పరిచయం చేశారు. అలాగే, ఆయన కుమార్తె మంజుల కూడా కొన్ని చిత్రాల్లో కనిపించింది. కానీ, అందులో మహేశ్ ఒక్కడే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

 

also read news:

-Advertisement-

క‌ర్మ అంటే ఇదే మ‌రి.. కోహ్లీతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!

Bigg Boss Telugu Season 6: ఆదిరెడ్డి పై నాగార్జున ఫైర్..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News