Telugu Flash News

Sitara Ghattamaneni : ఇంస్టాగ్రామ్ లో సితార ఫోటోలు.. నమ్రత పై ఫైర్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా ?

mahesh babu sitara photo

టాలీవుడ్ సూపర్ స్టార్, హీరో మహేష్ బాబు కూతురు సితార (Sitara Ghattamaneni) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె చిన్నప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అనే చెప్పాలి. ఇండస్ట్రీకి పరిచయం లేకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తండ్రి కంటే తల్లి ఎక్కువ పోస్ట్‌లను షేర్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించారు. అతి చిన్న వయసులోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సితార తన తియ్యటి మాటలతో అందరినీ తనవైపు తిప్పుకుంది. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో తన పేరుతో ఖాతాలు కూడా క్రియేట్ చేసింది. ఆ సోషల్ మీడియా ఖాతాలో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు.

నిత్యం తన ఫోటోలు మరియు డ్యాన్స్ వీడియోలను బాగా షేర్ చేస్తుంది. అంతే కాకుండా తన కుటుంబానికి సంబంధించిన పలు విషయాలను పంచుకుంటుంది. ఆమె తన సోదరుడితో బాగా ఆడుతున్న వీడియోలను కూడా షేర్ చేస్తుంది. అప్పుడప్పుడు తన తండ్రితో కలిసి సినిమా సెట్‌కి వెళ్లి అక్కడ జరిగిన విషయాలను పంచుకుంటుంది.

సితార ప్రతిరోజూ ఏదో ఒక పోస్ట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అంతేకాదు వెండితెరపై కూడా అడుగుపెట్టింది. తన తండ్రి నటించిన సర్కార్ వారి పాట సినిమా లోని ఓ పాటకు స్టెప్పులు కూడా వేశారు. కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లినప్పుడు కూడా మంచి ఫొటోలు తీసి షేర్ చేస్తుంటారు.

సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉందో, గౌతమ్ సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటాడు. సితార ఎనర్జీ చూసి చాలా మంది సితార త్వరలో హీరోయిన్ అవ్వాలని సపోర్ట్ చేస్తున్నారు. శాస్త్రీయ నృత్యం మాత్రమే కాదు, పాశ్చాత్య నృత్యాలు కూడా ఉన్నాయి.

రీసెంట్ గా స్కర్ట్ వేసుకుని డ్యాన్స్ చేస్తూ మరోసారి తన స్టెప్పులతో ఫాలోవర్స్ ని ఫిదా చేసింది. ట్రెడిషనల్ లుక్ తో పాటు అప్పుడప్పుడు గ్లామర్ లుక్స్ లో కూడా దర్శనమిస్తోంది.

ఈమె గ్లామర్ లుక్ లో కనిపిస్తే మహేష్ బాబు అభిమానులు చాలా ఫైర్ అవుతారు. అయితే తాజాగా ఆమె తల్లి నమ్రత తన రెండు ఫోటోలను షేర్ చేసింది.

అందులో, సితార టీ-షర్ట్ మాత్రమే ధరించి బెడ్ పై కూర్చుంది. ఆ ఫోటోలు చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కూతుర్ని ఎలా పెంచాలో తెలియడం లేదా, వాళ్లను మీలాగా తయారు చేస్తారా అంటూ దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

also see :

Mahesh Babu Latest Stylish Photos 09.06.2023

Mahesh Babu Guntur Kaaram Title Video

Exit mobile version