HomecinemaMahesh Babu: కృష్ణ కుటుంబంలో వ‌రుస మర‌ణాలు.. మూడేళ్లలో ముగ్గురు..!

Mahesh Babu: కృష్ణ కుటుంబంలో వ‌రుస మర‌ణాలు.. మూడేళ్లలో ముగ్గురు..!

Telugu Flash News

Mahesh Babu: సూప‌ర్ స్టార్ కృష్ణ కుటుంబంలో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణ రెండవ భార్య విజయనిర్మల 2019 జూన్ 27న హార్ట్ అటాక్ తో కన్నుమూసిన విష‌యం తెలిసందే. ఆమె హ‌ఠాన్మ‌ర‌ణంతో కృష్ణ షాక్‌లోకి వెళ్లారు. ఆమె మృతిని తట్టుకోలేకపోయారు. దశాబ్దాలుగా అర్థాంగిగా, స్నేహితురాలిగా, తోటి నటిగా, నిర్మాతగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నారు విజ‌య నిర్మల‌. ఆమె మృతి గురించి మ‌ర‌చిపోక‌ముందే ఈ యేడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసారు. పెద్ద కుమారుడు మృతితో కృష్ణ చాలా కుంగిపోయారు.

ఇక తాజాగా కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నమూయడం విషాదకరం.ఇందిరా దేవి కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో నివాసంలో ఈ తెల్లవారు ఝామున కన్నుమూసిన‌ట్టు తెలుస్తుంది. ఆమె మృతి కృష్ణ‌తో పాటు మ‌హేష్‌ని కుంగ‌దీసింది. నేడు మహాప్రాస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు జరగనున్నాయి. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు మహేష్ బాబు, రమేష్ సహా ఐదుగురు సంతానం. వీళ్లు కాకుండా మరో ముగ్గురు ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు.

ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగులో హీరోగా నటిస్తున్నవిష‌యం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ.. ఐదేళ్ల క్రితం విడుదలైన ‘శ్రీశ్రీ ’ మూవీ తర్వాత మరే సినిమాలో నటించలేదు. ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇందిరాదేవి.. సూప‌ర్ స్టార్ కృష్ణ మామ‌ కూతురు .వ‌రుస‌కు ఆమె త‌న‌కు మ‌ర‌ద‌లు అవుతుంది. అప్పుడే సినిమాల్లో రాణిస్తున్న కృష్ణ త‌న కుటుంబ స‌భ్యుల స‌ల‌హా మేర‌కు ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇక విజ‌య నిర్మ‌లతో ఎక్కువ సినిమాలు చేయ‌డం వ‌ల‌న ఆమెతో సాన్నిహిత్యం పెర‌గ‌డంతో రెండో పెళ్లి చేసుకున్నాడు కృష్ణ‌.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News