Telugu Flash News

Maha Shivratri : మహా శివరాత్రి నాడు ఉపవాసం వల్ల ఫలితమేంటి?

Mahashivratri 2022

Mahashivratri 2022

Maha Shivratri 2022 : మాఘమాసంలో చతుర్దశీ నిశీధ వ్యాపిని అయినరోజు మహా శివరాత్రి. మహాశివరాత్రి నాడు ఉపవాసము, నదీ స్నానము, శివార్చన, రాత్రి తెల్లవార్లు నిద్రపోకుండా మేల్కొని వుండి (జాగరణము) శివార్చన చేయుట వలన శివసాయుజ్యం పొందవచ్చు.

శివనామార్చన, శివనామ సంకీర్తనలతో కాలక్షేపం చేయుట వంటి వాటి వలన చాలా విశేష పుణ్యఫలము. నిత్య శివార్చన చేసిన ఫలితము, శివరాత్రి నాడు చేసిన ఫలితము సమానము. ఈ రోజు సర్వేశ్వరుడు అద్యంతములు లేని లింగాకార రూపంలో ఉద్భవించారు. అత్యంత విశేషమయిన ఈ రోజున కేవలం ఒక బిల్వ పత్రం శివుని నెత్తిన వుంచినా అది మోక్షప్రదాయకమౌతుంది.

The Mahashivratri festival is being celebrated on 1st March, 2022 .

 

Exit mobile version